బాలకృష్ణ గోల్డెన్ జూబ్లీ ఈవెంట్‌ ఇన్విటేషన్ చూసారా?

Nandamuri Balakrishna Completes 50 Years in TFI, Special Invitation Goes Viral

విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, అలనాటి తెలుగు చలనచిత్ర అగ్ర నటుడు, దివంగత నందమూరి తారక రామారావు నట వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నందమూరి బాలకృష్ణ నటుడిగా 50 వసంతాలు పూర్తిచేసుకోబోతున్నారు. తొలిసారి ఆయన నటించిన ‘తాతమ్మ కల’ సినిమా 1974 ఆగస్టు 30న విడుదలైంది. ఇందులో బాలకృష్ణ బాలనటుడిగా కనిపించారు. ఈ క్రమంలో ఈనెల 30వ తేదీతో ఆయన నటుడిగా పరిశ్రమలోకి అడుగుపెట్టి ఐదు దశాబ్దాలు కావోస్తోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ నేపథ్యంలో తెలుగు సినీ పరిశ్రమ ఆయన‌ను ఘనంగా సన్మానించాలని నిర్ణయం తీసుకుంది. దీనిలో భాగంగా బాలకృష్ణ గోల్డెన్‌ జూబ్లీ సెలబ్రేషన్స్‌కు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. సెప్టెంబర్ 1వ తేదీన సాయంత్రం 6 గంటలకు ఈ వేడుక హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించనున్నారు. ఇక ఈ సన్మాన వేడుకకు దేశ వ్యాప్తంగా అన్ని భాషల సినిమా ఇండ‌స్ట్రీలు, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులను ఆహ్వానిస్తున్నారు.

ఈ మేరకు ఈ వేడుకకు సంబంధించిన ఏర్పాట్లను పరిశ్రమకు చెందిన కొందరు ప్రముఖులు దగ్గరుండి చూసుకుంటున్నారు. తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి కార్యదర్శి కె.ఎల్‌ దామోదర్‌ ప్రసాద్‌, తెలంగాణ చలనచిత్ర వాణిజ్య మండలి అధ్యక్షుడు సునీల్‌ నారంగ్‌, తెలుగు సినీ నిర్మాతల మండలి కార్యదర్శి టి. ప్రసన్న కుమార్‌, తెలుగు సినీ కార్మిక సమాఖ్య అధ్యక్షుడు వల్లభనేని అనిల్‌ తదితరులు ఈ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

ఈ సందర్భంగా బాలకృష్ణ సన్మాక వేడుకకు సంబంధించిన ఆహ్వాన పత్రికను ప్రత్యేకంగా డిజైన్‌ చేశారు. ఇందులో బాల‌కృష్ణ సినిమా రంగానికి చేసిన‌, చేస్తున్న సేవ‌ల‌ను పొందుపరిచారు. అలాగే సినిమాల్లో ఆయన సాధించిన రికార్డుల‌ను, రాజ‌కీయ, సామాజిక కార్య‌మాల్లో ఆయ‌న చేస్తున్న‌ సేవ‌ల‌ను ప్రస్తావించారు. ప్రస్తుతం ఈ ఆహ్వాన ప‌త్రిక సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

ఇక తాతమ్మ కల చిత్రంతో కెరీర్‌ స్టార్ట్‌ చేసిన బాలకృష్ణ తన సుదీర్ఘ కెరీర్‌లో ఇండస్ట్రీకి ఎన్నో బ్లాక్‌బస్టర్‌ హిట్స్‌ అందించారు. హిస్టారిక్‌, బయోపిక్స్‌, మైథాలాజికల్‌, సైన్స్‌ ఫిక్షన్‌, సోషల్‌.. ఇలా అన్ని తరహా జానర్లలో నటించడం విశేషం. ఇప్పటివరకూ 108 చిత్రాల్లో నటించిన ఆయన ప్రస్తుతం 109వ సినిమాలో నటిస్తున్నారు. సక్సెస్‌ఫుల్ డైరెక్టర్‌ బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్యలు నిర్మిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.