టాలీవుడ్‌లో క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ ప్రముఖ దర్శకుడు కె. విజయ్ భాస్కర్. చాలాకాలం తర్వాత ఆయన మెగా ఫోన్ పట్టుకుని దర్శకత్వం వహించిన తాజా సినిమా ‘ఉషా పరిణయం’. బ్యూటిఫుల్ టైటిల్‌తో రూపొందిన ఈ చిత్రానికి లవ్ ఈజ్ బ్యూటిఫుల్ అనేది ఉపశీర్షిక. శ్రీకమల్, తాన్వీ ఆకాంక్ష, సూర్య ప్రధానపాత్రలు పోషించిన ఈ మూవీ ఆగస్టు 2న చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ నేపథ్యంలో ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇటీవలే ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో సీనియర్ నటుడు శివాజీ రాజా, సంగీత దర్శకుడు ఆర్.ఆర్.ధ్రువన్, కెమెరామెన్ సతీష్ ముత్యాల, కో-డైరెక్టర్ కాళీ, కాస్ట్యూమ్ డిజైనర్ శాన్వి తదిరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దర్శకుడు కె.విజయ్‌భాస్కర్ మీడియాతో చిత్ర విశేషాలపై ముచ్చటించారు.
“సాయి ద రియల్ హీరో.. సాయి దుర్గ తేజ్ హీరోగానే కాకుండా సమాజం గురించి కూడా ఆలోచిస్తాడు. పద్నాలుగేళ్ల తరువాత సాయిను చూస్తున్నాను. సాయిని 14 ఏళ్ల క్రితం పవన్‌కల్యాణ్ గారి నిర్మాణ సారథ్యంలో నేనే హీరోగా ఇంట్రడ్యూస్ చేయాలి కానీ కుదరలేదు. ఆ రోజు ఎంత వినయంగా, సంస్కారంతో వున్నాడో.. ఈ రోజు అలాగే వున్నాడు, చిరంజీవి గారి దగ్గర వున్న ప్రేమ సాయిలో కనిపించింది. మమ్ములను టీమ్‌ను ఎంకరైజ్ చేయడానికి వచ్చినందుకు ఆనందంగా వుంది” అని పేర్కొన్నారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ.. “నాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మా ఫ్యామిలీ సపోర్ట్‌తో ఈ సినిమా నిర్మించాను. ఈ చిత్రానికి ధ్రువన్ చాలా మంచి సంగీతం ఇచ్చాడు. మా ఇద్దరికి ట్యూన్ అయ్యింది. సతీష్ ఫోటోగ్రఫీ ఈ సినిమాకు ఎంతో ప్లస్ అయ్యింది. తన్వీ స్వీటెస్ట్ గర్ల్. చాలా కంఫర్టబుల్ హీరోయిన్. నో ప్రాబ్లెమ్ గర్ల్. కాశ్మీర్‌లో ఎంత ఇబ్బంది అయినా అంత చలిలో కూడా ఎంతో సహకరించింది. సినిమాలో టెక్నిషియన్స్, ఆర్టిస్ట్ కూడా ఎంతో ఓన్ చేసుకుని ఈ సినిమా చేశారు” అని తెలిపారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























