కోలీవుడ్ స్టార్ హీరో, నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్టర్ ధనుష్ స్వీయ దర్శకత్వంలో నటించిన తాజా చిత్రం ‘రాయన్’. ఇది ధనుష్ 50వ చిత్రం కావడం, అందునా ఆయనే దర్శకత్వం వహించడంతో ఈ మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో జులై 26న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చింది. ఇక రాయన్ చిత్రాన్ని తమిళంలో సన్ పిక్చర్స్ నిర్మించగా.. తెలుగు వెర్షన్‌ను ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ ఎల్‌ఎల్‌పి గ్రాండ్‌గా విడుదల చేసింది. సూపర్ హిట్ టాక్‌తో బాక్సాఫీస్ వద్ద సక్సెస్‌ఫుల్‌గా దూసుకుపోతోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ నేపథ్యంలో రాయన్ చిత్రంపై టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రశంసల వర్షం కురిపించారు. తాజాగా ఈ సినిమాను వీక్షించిన ఆయన సోషల్ మీడియాలో ఇలా తెలిపారు.. “ధనుష్ నటన నెక్స్ట్ లెవెల్లో ఉందంటూ కితాబిచ్చారు. రాయన్ సినిమాలో ధనుష్ నటన, దర్శకత్వం అద్భుతం. ఎస్.జే. సూర్య, ప్రకాష్ రాజ్, సందీప్ కిషన్ మరియు ఇతర నటీనటులు అత్యుత్తమ ప్రదర్శన అందించారు. మాస్ట్రో రెహమాన్ ఎలక్ట్రిఫైయింగ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు. రాయన్ తప్పక చూడవలసిన చిత్రం. మొత్తం టీమ్‌కి అభినందనలు” అని తెలిపారు. ఇక మహేష్ ట్వీట్‍పై ధనుష్ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, రాయన్ టీం అంతా ఎంతో థ్రిల్ అయ్యామని రిప్లై ఇచ్చాడు.
అయితే ఇదిలావుంటే, మరోవైపు మహేష్ బాబు రాయన్‍పై ప్రశంసల జల్లు కురిపించడంపై తమిళ ఆడియెన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఒక తెలుగు హీరో, అందునా స్టార్ హీరో అయివుండి ఎలాంటి ఈగో లేకుండా ఇలా పక్క పరిశ్రమకు చెందిన హీరో సినిమా గురించి పాజిటివ్‌గా మాట్లాడటంతో వారు పొంగిపోతున్నారు. దీంతో సోషల్ మీడియా వేదికగా ధనుష్ ఫ్యాన్స్ మహేష్ విశాల హృదయానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు. కాగా ఈ చిత్రంలో సెల్వ రాఘవన్, జయరామ్, దుషరా విజయన్, అపర్ణ బాలమురళీ, వరలక్ష్మి శరత్ కుమార్, శరవణన్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























