కోలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో విజయ్ ఆంటోని ప్రధానపాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘తుఫాన్’. తమిళంలో ‘మరయ్ పిడిక్కత్త మనిథన్’గా తెరకెక్కిన ఈ మూవీని తెలుగులో తుఫాన్ పేరుతో విడుదల చేస్తున్నారు మేకర్స్. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి రచనతో పాటు విజయ్ మిల్టన్ దర్శకత్వం వహించాడు. ఇన్ఫినిటీ ఫిల్మ్ వెంచర్స్ బ్యానర్‌పై కమల్ బోరా, డి. లలితా, బి. ప్రదీప్, పంకజ్ బోరా నిర్మిస్తున్న తుఫాన్ ఆగస్టు 2న వరల్డ్ వైడ్‌గా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ నేపథ్యంలో చిత్రయూనిట్ ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. దీనిలో భాగంగానే ఇప్పటికే పలు పోస్టర్లు టీజర్ రిలీజ్ చేయగా వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే ఇటీవలే విడుదలైన థియేట్రికల్ ట్రైలర్ కూడా ఆకట్టుకుంది. ఈ క్రమంలో తాజాగా తుఫాన్ నుంచి ‘స్నీక్ పీక్’ రిలీజ్ చేసింది చిత్ర బృందం. ఈ స్నీక్ పీక్ అదిరిపోయేలా రూపొందించారు. విజయ్ ఆంటోనీ యాక్షన్ సీక్వెన్స్ ప్రేక్షకులతో విజిల్స్ వేయించేలా ఉంది.
ఇక తుఫాన్ సినిమాలో విజయ్ ఆంటోని సరసన మేఘా ఆకాష్ కథానాయికగా నటిస్తుండగా.. ‘కట్టప్ప’ సత్యరాజ్, మురళీశర్మ, పృథ్వీ అంబర్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇక ఈ సినిమాకు అచ్చు రాజమణితో కలిసి విజయ్ ఆంటోని సంయుక్తంగా సంగీతం అందిస్తుండగా.. దర్శకుడు విజయ్ మిల్టన్ సినిమాటోగ్రఫీ నిర్వహిస్తుండటం విశేషం.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:






























