టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రామ్ నుండి రాబోతున్న మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ డబుల్ ఇస్మార్ట్. డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వస్తున్న ఈసినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. దానికి కారణం ఈసినిమా వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ కు సీక్వెల్ గా వస్తుండటమే. ఇక అంచనాలకు తగ్గట్టుగా ఇప్పటికే వచ్చిన అప్ డేట్లు మంచి బజ్ ను క్రియేట్ చేశాయి. ఆగష్ట్ 15 వ తేదీన రిలీజ్ కానున్న నేపథ్యంలో చిత్రయూనిట్ ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈసినిమా మ్యూజికల్ జర్నీని కూడా ఇప్పటికే మొదలుపెట్టారు. దీనిలో భాగంగానే ఈసినిమా నుండి ఇప్పటికే రెండు సాంగ్స్ ను రిలీజ్ చేశారు మేకర్స్. స్టెప్పా మార్, మార్ ముంతా.. చోడ్ చింతా అంటూ వచ్చిన రెండు పాటలు మాస్ బీట్ తో మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి. రెండు పాటలు కూడా ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నాయి. ఇప్పుడు మూడో పాటను రిలీజ్ చేశారు. క్యా లఫ్డా అనే ఫుల్ సాంగ్ ను తాజాగా రిలీజ్ చేశారు మేకర్స్. రామ్ పోతినేని, కావ్య థాపర్ ల పై చిత్రీకరించిన ఈ పాట రొమాంటిక్ మెలోడీగా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. శ్రీహర్ష ఈమని లిరిక్స్ అందించిన ఈ పాటను ధనుంజయ్, సింధుజ శ్రీనివాసన్ కలిసి పాడారు.
కాగా ఈసినిమాలో ఇంకా బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. అలీ, షయాజీ షిండే, గెటప్ శ్రీను, ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. ఈసినిమాను పూరి కనెక్ట్స్ పై పూరీ జగన్నాథ్, ఛార్మి కలిసి నిర్మించనున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. శ్యామ్ కే నాయుడు, జియాని జియానెలి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























