టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో తమ్ముడు సినిమా కూడా ఒకటి. ఎంసీఏ, వకీల్ సాబ్ ఫేమ్ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది. బ్రదర్ అండ్ సిస్టర్ నేపథ్యంలో ఎమోషనల్ ఎంటర్ టైనర్ గా వస్తున్న ఈసినిమా షూటింగ్ దశలో ఉంది. ఇప్పుడు ఈసినిమా నుండి మరో వార్త తెరపైకి వచ్చింది. అదేంటంటే నితిన్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అన్న సంగతి తెలిసిందే కదా. ఈ నేపథ్యంలోనే తమ్ముడు సినిమాలో పవన్ కళ్యాణ్ కు సంబంధించి ఒక సూపర్ హిట్ సాంగ్ ను రీమేక్ చేస్తున్నాడన్న వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే ఇప్పుడు దీనిపై క్లారిటీ ఇచ్చారు చిత్రటీమ్. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని.. ఫేక్ న్యూస్ అని క్లారిటీ ఇచ్చారు. కాగా ఈసినిమాలో నితిన్ అక్కగా లయ నటిస్తుండగా కాంతారా ఫేమ్ సప్తమి గౌడ హీరోయిన్ గా నటిస్తుంది. కాంతారా ఫేమ్ అజినీష్ లోక్ నాథ్ సంగీతం అందిస్తున్నాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక నితిన్ ఈసినిమా కాకుండా రాబిన్ హుడ్ అనే సినిమా కూడా చేస్తున్నాడు.వెంకీ కుడుముల ఈసినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. నితిన్-వెంకీ కుడుముల కాంబినేషన్ లో వస్తున్న రెండో సినిమా ఇది. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన భీష్మ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో ఈసినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకునే పనిలో ఉంది. కాగా నట కిరీటి రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్ ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈసినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మిస్తున్నారు. జీవీ ప్రకాష్ సంగీతం అందిస్తున్నాడు. సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీని అందిస్తుండగా, ప్రవీణ్ పూడి ఎడిటర్ గా, రామ్ కుమార్ ఆర్ట్ డైరెక్టర్ గా పని చేస్తున్నారు. ఈసినిమా నిర్మిస్తుండగా డిసెంబర్ 20న విడుదలకానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























