లక్కీ భాస్కర్ టైటిల్ ట్రాక్ రిలీజ్ డేట్ ఫిక్స్

dulquer salmaan lucky bhaskar movie title track release date fixed

మలయాళం స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ తెలుగులో కూడా సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇప్పటికే సీతారామం సినిమాతో సూపర్ హిట్ కొట్టి తెలుగులో మంచి మరింత క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు మరో సినిమాతో వచ్చేస్తున్నాడు. వెంకీ అట్లూరీ దర్శకత్వంలో దుల్కర్ హీరోగా వస్తున్న సినిమా లక్కీ భాస్కర్. పీరియాడిక్ డ్రామాగా వస్తున్న ఈసినిమాలో దుల్కర్ బ్యాంక్ క్యాషియర్ గా కనిపించనున్నాడు. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన మూవీ టీజర్, ఫస్ట్ సింగిల్ శ్రీమతి గారు పాట మంచి రెస్పాన్స్ నే సొంతం చేసుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈసినిమా నుండి మరో అప్ డేట్ ను ఇచ్చారు మేకర్స్. ఈసినిమా టైటిల్ ట్రాక్ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేస్తూ అధికారికంగా ప్రకటించారు మేకర్స్. జులై 28వ తేదీన టైటిల్ ట్రాక్ ను రిలీజ్ చేయనున్నట్టు తెలిపారు. లెెజెండరీ సింగర్ ఉషా ఉతప్ గాత్రంలో, జీవీ ప్రకాష్ కంపోజిషన్ లో 90 కాలం నాటి బీట్ వినడానికి రెడీ గా ఉండండి అంటూ తెలిపారు.

కాగా ఈసినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తుంది. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో ఈసినిమాను సితారా ఎంటర్ టైన్ మెంట్స్, ఫార్చూన్ 4 సినిమాస్ బ్యానర్ పై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఈసినిమాను తెలుగు తో పాటు మలయాళంలో కూడా రిలీజ్ చేయనున్నారు. జీవీ ప్రకాష్ ఈసినిమాకు సంగీతం అందిస్తున్నాడు. సెప్టెంబర్ 7వ తేదీన ఈసినిమాను రిలీజ్ చేయనున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.