కమిటీ కుర్రోళ్ళు.. ట్రైలర్ రిలీజ్

Niharika Konidela's Committee Kurrollu Trailer Out

మెగా డాటర్ నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ మరియు ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై ప్రొడక్షన్ నెం.1గా రూపొందిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’. ఈ సినిమాకు యంగ్ డైరెక్టర్ య‌దు వంశీ ద‌ర్శ‌కత్వం వహిస్తుండగా.. పద్మజ కొణిదెల, జయలక్ష్మి అడపాక నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. వచ్చే ఫ్రెండ్ షిప్ డే వీక్ సంద‌ర్భంగా ఆగ‌స్ట్ 9న కమిటీ కుర్రోళ్ళు విడుద‌లకానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ కార్యక్రమాలను వేగవంతం చేసింది. ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి విడుద‌లైన టీజ‌ర్‌, లిరిక‌ల్ సాంగ్స్‌కు చాలా మంచి స్పంద‌న రావడంతో మూవీపై మంచి బ‌జ్ క్రియేట్ అయ్యింది. ఈ క్రమంలో శుక్రవారం కమిటీ కుర్రోళ్ళు థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేసింది చిత్ర బృందం. ఇక ట్రైలర్ గమనిస్తే.. ఒక ఊరిలో జరిగే జాతర, స్థానిక ఎన్నికలు, సామాజిక కట్టుబాట్లు, భవిష్యత్తు కోసం కళలు కనే యువత.. ఈ నేపథ్యంలో సాగే కథగా అర్ధమవుతోంది.

గ్రామీణ నేపథ్యంలో ఫ్రెండ్ షిప్‌, ల‌వ్ అండ్ ఎమోష‌న‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతోన్న ఈ కమిటీ కుర్రోళ్ళు చిత్రంలో దాదాపు అందరూ కొత్తవారే నటిస్తున్నారు. మొత్తం 11మంది హీరోలు, 4గురు హీరోయిన్స్‌ పరిచయం అవుతుండటం విశేషం. సందీప్ సరోజ్, యశ్వంత్ పెండ్యాల, ఈశ్వర్ రాచిరాజు, త్రినాద్ వర్మ, ప్రసాద్ బెహరా, మణికంఠ పరసు, లోకేష్ కుమార్ పరిమి, శ్యామ్ కళ్యాణ్, రఘువరన్, శివకుమార్ మట్ట, అక్షయ్ శ్రీనివాస్, రాధ్య, తేజస్వి రావు, టీనా శ్రావ్య, విషిక నటించారు. సాయి కుమార్, గోపరాజు రమణ, బలగం జయరాం, శ్రీ లక్ష్మి, కంచెరపాలెం కిషోర్, కిట్టయ్య, రమణ భార్గవ్, జబర్దస్త్ సత్తిపండు తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించారు.

ఇక ఈ చిత్రానికి రాజు ఎడురోలు సినిమాటోగ్ర‌ఫీ అందించడగా, అన్వర్ అలీ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు. అనుదీప్ దేవ్ సంగీతం సమకూర్చగా, ప్రొడక్షన్ డిజైనర్‌గా ప్రణయ్ నైని పని చేశారు. విజయ్ మాస్టర్ ఫైట్స్ రూపొందించగా, జె.డి మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు. అలాగే వెంకట సుభాష్ చీర్ల, కొండల రావు అడ్డగళ్ల సంభాషణలు రాశారు. నిహారిక కొణిదెల సమర్పణలో తొలిసారిగా వస్తుండటంతో ఈ కమిటీ కుర్రోళ్ళు పై మంచి అంచనాలే ఉన్నాయి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.