తిరగబడరసామీ పవర్ ఫుల్ టైటిల్ సాంగ్ రిలీజ్

raj tarun tiragabadara saami powerful title song released

సక్సెస్ ఫుల్ డైరెక్టర్ ఎ ఎస్ రవికుమార్ చౌదరి దర్శకత్వంలో యంగ్ అండ్ ప్రామెసింగ్ హీరో రాజ్ తరుణ్ హీరోగా, మాల్వి మల్హోత్రా హీరోయిన్ గా వస్తున్న సినిమా తిరగబడరసామీ. యూత్ ని ఆకట్టుకునే రోమాన్స్ తో పాటు ఫ్యామిలీని ఆకర్షించే సెంటిమెంట్, మాస్ ని అలరించే హై వోల్టేజ్ యాక్షన్, ఎమోషనల్ ఎలిమెంట్స్ తో ఈ సినిమాను రూపొందించారు. ఈసినిమా ఆగష్ట్ 2వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ప్రస్తుతం ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలు మంచి బజ్ క్రియేట్ చేసి సినిమాపై క్యురియాసిటీని పెంచాయి. తాజాగా ‘తిరగబడరసామీ’ టైటిల్ సాంగ్ ని రిలీజ్ చేశారు మేకర్స్. కంపోజర్ జెబి ఈ సాంగ్ ని పవర్ ఫుల్ గా ట్యూన్ చేశారు. సాయి చరణ్, లోకేశ్వర్ ఈదర, చైతు సత్సంగి వోకల్స్ ఎనర్జిటిక్ గా వున్నాయి. సుద్దాల అశోక్ తేజ చాలా పవర్ ఫుల్ లిరిక్స్ అందించారు. ఈ సాంగ్ లో తరుణ్ తరుణ్ మాస్ యాక్షన్ ప్యాక్డ్ అవతార్ లో కనిపించారు.

కాగా మన్నారా చోప్రా ఈసినిమాలో ఓ డిఫరెంట్ క్యారెక్టర్ తో పాటు ఒక స్పెషల్ సాంగ్ లో కనిపించనున్నారు. మకరంద్ దేశ్‌పాండే, జాన్ విజయ్, రఘు బాబు, అంకిత ఠాకూర్, పృధ్వి, ప్రగతి, రాజా రవీంద్ర, బిత్తిరి సత్తి ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్ మీడియా బ్యానర్ పై మల్కాపురం శివకుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జవహర్ రెడ్డి కెమరామెన్ గా పని చేస్తుండగా.. బస్వా పైడిరెడ్డి ఎడిటర్, రవికుమార్ గుర్రం ఆర్ట్ డైరెక్టర్.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.