సాధారణంగా హీరో హీరోయిన్లు కెరీర్ లో కలిసిరానప్పుడు పేర్లు మార్చుకోవడం చూస్తుంటాం. ఇప్పటికే ఎంతో మంది సెలబ్రిటీలు తమ లక్ కోసం పేర్లను మార్చుకున్నారు. ఇప్పుడు మరో కుర్ర హీరో కూడా తమ పేరులో మార్పును చేసుకున్నాడు. ఆ కుర్ర హీరో ఎవరో కాదు డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరీ. బాలనటుడిగా పలు సినిమాల్లో నటించిన ఆకాష్ పూరీ మెహబూబా సినిమాతో హీరోగా తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. ఆ తరువాత రొమాంటిక్, చోర్ బజార్.. సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఏ సినిమా కూడా మంచి హిట్ ను అందించలేకపోయాయి. ప్రస్తుతం అయి ఆకాష్ పూరీ పలు సినిమాలను లైన్ లో పెట్టినట్టు తెలుస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా నేడు ఆకాష్ పూరీ తన పుట్టినరోజును జరుపుకుంటున్నాడు. ఈనేపథ్యంలోనే తన పేరు మార్చుకున్నట్టు సోషల్ మీడియా ద్వారా తెలిపాడు. తన పేరులో చిన్న మార్పు వచ్చిందని.. ఇన్ని రోజులు ఆకాష్ పూరీ గా ఉన్నాను.. ఇక నుండి ఆకాష్ జగన్నాధ్ అంటూ తెలిపాడు. అయితే ఆకాష్ తన పేరు చివర పెట్టుకున్న ఈ రెండు పేర్లు కూడా తండ్రి పేరులోనివే. మరి ఈ పేరు మార్చడం వల్ల ఆకాష్ లక్ ఏదైనా మారుతుందేమో చూద్దాం..
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























