మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ‘విశ్వంభర’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. వశిష్ట మల్లిడి దర్శకత్వంలో సోషియో ఫాంటసీ మూవీగా తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మరోవైపు ఆయన తనయుడు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఎస్ శంకర్ డైరెక్షన్ లో ‘గేమ్ ఛేంజర్’లో కథానాయకుడిగా చేస్తున్నారు. దీని తరువాత ఆయన ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో #RC16 చేయనున్నారు. ఇలా ప్రొఫెషనల్ కమిట్‌మెంట్స్‌తో ఫుల్ బిజీగా ఉన్న ఈ ఇద్దరు హీరోలు తమ రొటీన్ లైఫ్‌కి కొంచెం విరామం ప్రకటించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
తాజాగా ఈ మెగా హీరోలు ఫ్యామిలీతో కలిసి హాలీడే వెకేషన్‌కి వెళ్లారు. ఇక వీరి వెంట మెగా ప్రిన్సెస్ క్లిన్ కారా కూడా ఉండటం విశేషం. కాగా శుక్రవారం నుంచి పారిస్‌లో సమ్మర్ ఒలింపిక్స్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో.. ఈ గ్రాండ్ ఈవెంట్‌కు హాజరవనున్నారు. చిరంజీవి, రామ్ చరణ్‌లు లండన్ చేరుకున్నారు. దీనిలో భాగంగా పారిస్‌కు వెళ్లే మార్గంలో లండన్‌లోని హైడ్ పార్క్‌ను సందర్శించారు. ఇక మెగా ఫ్యామిలీ హైడ్ పార్క్‌లో ఎంజాయ్ చేస్తున్న ఫోటోను మెగాస్టార్ స్వయంగా సోషల్ మీడియాలో షేర్ చేయగా.. ప్రస్తుతం అది నెట్టింట వైరల్ అవుతోంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























