లెజెండరీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా వస్తున్నసినిమా గేమ్ ఛేంజర్. పొలిటికల్ థ్రిల్లర్ జోనర్‌లో వస్తోన్న ఈసినిమాలో చరణ్ డ్యూయల్ రోల్ చేస్తున్నాడు. అందులో ఒకటి గ్రామీణ పాత్రలో మరొకటి ఐఏఎస్ పాత్రలో నటించబోతున్నాడు. ఇక ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకునే పనిలో ఉన్నారు. ఈసినిమా గురించి అప్ డేట్ వచ్చి చాలా కాలమే అయిపోయింది. అప్పుడెప్పుడే జరగండి జరగండి అంటూ ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేశారు. ఆ తరువాత ఇప్పటివరకూ సాలిడ్ అప్ డేట్ ఇచ్చింది లేదు. మరోవైపు రిలీజ్ డేట్ పై కూడా ఎలాంటి క్లారిటీ లేదు. ముందు సెప్టెంబర్ లో రిలీజ్ చేస్తారని అనుకున్నారు. కానీ షూటింగ్ జాప్యం వలన సెప్టెంబర్ నుండి తప్పుకోవాల్సి వచ్చింది. అయితే రీసెంట్ గా ఒక మూవీ ఈవెంట్ లో పాల్గన్న దిల్ రాజు ఈసినిమా రిలీజ్ పై క్లారిటీ ఇచ్చారు. డేట్ అయితే చెప్పలేదు కానీ క్రిస్మస్ కు కలుసుకుందా అని చెప్పారు. మరి డేట్ పై త్వరలో ఏమన్నా క్లారిటీ ఇస్తారేమో చూడాలి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా తాజాగా టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ కూడా గేమ్ ఛేంజర్ అప్ డేట్ ఇచ్చాడు. డైరెక్టర్ మారుతి ప్రజెంట్స్ బిగ్గెస్ట్ మ్యూజికల్ ఈవెంట్ జామ్‌జంక్షన్ షో సెప్టెంబర్ 6న హైటెక్స్ గ్రౌండ్స్‌లో జరగనుంది. ఈనేపథ్యంలోనే ఈ ఈవెంట్ కర్టెన్‌రైజర్ ప్రెస్ మీట్ ను గ్రాండ్ గా నిర్వహించారు. ఈకార్యక్రమంలో టాప్ మ్యూజిర్ డైరెక్టర్ థమన్, నిర్మాత ఎస్కేఎన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా థమన్ గేమ్ ఛేంజర్ సినిమా గురించి చెబుతూ.. డిసెంబర్‌లో రిలీజ్ అని మొన్న దిల్‍రాజు మంచి బ్లాస్ట్ ఇచ్చారు. ఆగష్ట్ లాస్ట్ వీక్ నుండి అప్‍డేట్స్ ఇవ్వడం మొదలుపెడతాం.. ఈసినిమాలో ఏడు పాటలు ఉన్నాయి.. రెండో పాట డేట్‍ను డైరెక్టర్ శంకర్ ఫిక్స్ చేయాల్సి ఉందని.. రెండో పాట అయినా లీక్ కాక ముందే రిలీజ్ చేస్తామని అనుకుంటున్నామని చమత్కరించారు.
కాగా గేమ్ ఛేంజర్ సినిమాలో కియారా హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇంకా ఈసినిమాలో శ్రీకాంత్, జయరామ్, అంజలి, సునీల్, నవీన్ చంద్ర కూడా ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు ఈసినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న ఈసినిమాను తమిళ్, తెలుగు, హిందీలో చిత్రీకరిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:


































