టాలీవుడ్‌లో గత కొంతకాలంగా రీ రిలీజ్‌ల ట్రెండ్ నడుస్తోన్న విషయం తెలిసిందే. తాజాగా ఈ లిస్టులోకి మెగాస్టార్ చిరంజీవి నటించిన సూపర్ హిట్ చిత్రం ఒకటి చేరబోతోంది. ఆయన కెరీర్‌లో గుర్తుండిపోయే సినిమాలలో ఒకటైన ‘ఇంద్ర’ సినిమా మళ్లీ విడుదలకు సిద్ధమైంది. ఇండస్ట్రీ హిట్ అయిన ఈ సినిమాను మరోసారి రిలీజ్ చేయాలని మెగా అభిమానులు ఎప్పటినుంచో మేకర్స్‌ను కోరుతున్నారు. ఇన్నాళ్లకు వారి ఎదురుచూపులకు తెరపడింది. ఈ బ్లాక్ బస్టర్ మూవీ త్వరలోనే మరోసారి థియేటర్లలో సందడి చేయనుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ మేరకు మేకర్స్ సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించారు. వైజయతి మూవీస్ ప్రారంభించి 50 ఏళ్ళు పూర్తయిన నేపథ్యంలో, మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 22న ఇంద్ర చిత్రాన్ని రీ రిలీజ్ చేయనున్నట్టు చిత్ర నిర్మాణ సంస్థ ప్రకటించింది. కాగా టాలీవుడ్ చరిత్రలోనే ఇంద్ర అత్యధిక కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకుని రికార్డ్ సృష్టించింది. కర్ణాటకలోని నాలుగు థియేటర్లు సహా మొత్తం 122 సెంటర్లలో 100 డేస్ ప్రదర్శించబడింది.
సీనియర్ డైరెక్టర్ బి. గోపాల్ దర్శకత్వం వహించిన ఇంద్ర చిత్రం 2002 జూలై 24న రిలీజయ్యింది. ఈ సినిమాలో సోనాలి బింద్రే, ఆర్తి అగర్వాల్ హీరోయిన్లుగా నటించారు. వైజయంతీ మూవీస్ పతాకంపై సి. అశ్వనీదత్ నిర్మించారు. నాడు తెలుగునాట నడుస్తున్న ట్రెండ్‌కి అనుగుణంగా ఫ్యాక్షనిజం నేపథ్యంలో తెరకెక్కింది. మణిశర్మ సంగీతం అందించిన ఈ చిత్రం లోని పాటలన్నీ చార్ట్ బస్టర్‌గా నిలిచాయి. ఇక 2002వ సంవత్సరానికి గానూ చిరంజీవి ఉత్తమ నటుగా నంది పురస్కారం అందుకున్నారు.
ఇక ఇటీవలే పాన్ ఇండియా రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన ‘కల్కి 2898 AD’ చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు వైజయతి మూవీస్ అధినేత అశ్వనీదత్. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన ఈ విజువల్ వండర్‌లో ఇండియన్ లెజెండరీ యాక్టర్స్ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ ప్రధానపాత్రలు పోషించగా.. బాలీవుడ్ భామలు దీపికా పదుకొణె, దిశా పటాని ఫీమేల్ లీడ్ రోల్స్ లో కనిపించారు. ఫ్యూచరిస్టిక్ ఎపిక్ మైథాలజీగా తెరకెక్కిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.1,000 కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకుని బాక్సీఫీస్ వద్ద దూసుకుపోతోంది.
ఇక ఇదిలావుంటే, చిరంజీవి ప్రస్తుతం ‘విశ్వంభర’ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ‘బింబిసార’ ఫేమ్ వసిష్ఠ మల్లిడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మెగాస్టార్ సరసన త్రిష కృష్ణన్ కథానాయికగా నటిస్తోండగా.. సురభి, ఈషా చావ్లా, ఆషికా రంగనాథ్ చిరు చెల్లెళ్ళుగా కనిపించనున్నారు. ఆస్కార్ అవార్డ్ విన్నింగ్ మ్యూజిక్ కంపోజర్ ఎంఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నాడు.యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 10న భారీ అంచనాల మధ్య విడుదలకానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























