యంగ్ హీరోయిన్ మీనాక్షి చౌదరి ప్రస్తుతం వరస సినిమాలతో ఫుల్ బిజీ అయ్యింది.ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 6సినిమాలు చేస్తుంది.ఇందులో దాదాపు అన్ని క్రేజీ ప్రాజెక్టులే వున్నాయి.ఈసినిమాల విషయానికి వస్తే…
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
తమిళ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న ది గోట్ లో మీనాక్షి ఓ హీరోయిన్ గా నటిస్తుంది.ఇందులో విజయ్ డ్యూయెల్ రోల్ లో కనిపించనున్నాడు.వెంకట్ ప్రభు తెరకెక్కిస్తుండగా సెప్టెంబర్ 5న విడుదలకానుంది.ఇది కాకుండా మీనాక్షి ప్రస్తుతం చేసేవన్నీ తెలుగు సినిమాలే.అందులో దుల్కర్ సల్మాన్ సరసన లక్కీ భాస్కర్ లో నటిస్తుంది.వెంకీ అట్లూరి డైరెక్ట్ చేస్తున్నాడు.సెప్టెంబర్ 7న విడుదలకానుంది.
అలాగే విశ్వక్ సేన్ కు జోడిగా మెకానిక్ రాకీ చేస్తుంది.ఇందులో శ్రద్దా శ్రీనాథ్ మరో హీరోయిన్ గా నటిస్తుంది.అక్టోబర్ 31న విడుదలకానుంది. వీటితోపాటు మీనాక్షి మచ్ అవైటెడ్ మూవీ విశ్వంభర లో కీలక పాత్రలో అనిల్ రావిపూడి -వెంకటేష్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాలో వెంకీ ఎక్స్ లవర్ గా కనిపించనుంది.ఈరెండు సంక్రాంతికి విడుదలకానున్నాయి.ఇవి కాకుండా ఆమె మట్కాలో వరుణ్ తేజ్ సరసన నటిస్తుంది.ఈసినిమా కూడా వచ్చే ఏడాది విడుదలకానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:

































