హనుమాన్ నిర్మాతల చేతికి డబుల్ ఇస్మార్ట్ 

Primeshow Entertainment bags Double ISMART theatrical rights

ఉస్తాద్ రామ్, డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ల మచ్ అవైటెడ్ సీక్వెల్ డబుల్ ఇస్మార్ట్ థియేట్రికల్ బిజినెస్ క్లోజ్ అయ్యింది.హనుమాన్ నిర్మాతలు ఈ థియేట్రికల్ హక్కులను దక్కించుకున్నారు.కేవలం తెలుగు వెర్షన్ మాత్రమే కాదు కన్నడ,మలయాళ, తమిళ, హిందీ భాషల రైట్స్ తోపాటు ఓవర్సీస్ హక్కులను కూడా సొంతం చేసుకున్నారు.సినిమా మీద వున్న నమ్మకంతో ఫ్యాన్సీ రేటు కు ఈరైట్స్ దక్కించుకున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక రీసెంట్ గా రిలీజ్ చేసిన  రెండు  పాటలు సినిమాకు హైప్ తీసుకొచ్చాయి.ట్రైలర్ ఒక్కటి పక్కాగా కట్ చేస్తే  భారీ ఓపెనింగ్స్ గ్యారెంటీ.ఎలాగూ లాంగ్ వీకెండ్ కూడా అడ్వాంటేజ్ కానుంది.అయితే బాక్సాఫీస్ వద్ద పోటీ ఎదురుకానుంది.ఆగస్టు15న రవితేజ -హరీష్ శంకర్ ల మిస్టర్ బచ్చన్ కూడా రిలీజ్ అవుతుంది.దాంతో క్లాష్ ఇంట్రెస్టింగ్ గా ఉండనుంది.మరోవైపు ఈసినిమా విజయం పూరికి తప్పనిసరి కానుంది.మరి డబుల్ ఇస్మార్ట్, ఇస్మార్ట్ శంకర్ లాగే బ్లాక్ బాస్టర్ అయ్యి పూరిని ట్రాక్ లోకి తీసుకొస్తుందో చూడాలి.

డబుల్ ఇస్మార్ట్ లో కావ్య థాపర్ హీరోయిన్ గా నటించగా బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ విలన్ పాత్రలో కనిపించనున్నాడు.మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.ఛార్మి తో కలిసి పూరి జగన్నాథ్ ఈసినిమాను నిర్మిస్తున్నాడు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.