మనమే ఓటీటీ రిలీజ్ పై క్లారిటీ

Interesting update on sharwanand manamey movie ott release

టాలీవుడ్ టాలెంటెడ్ నటుడు శర్వానంద్ కు మంచి హిట్ దక్కి చాలా కాలమైంది. వరుస పరాజయాల తరువాత రెండేళ్ల క్రితం వచ్చిన ఒకే ఒక జీవితం సినిమాతో డీసెంట్ హిట్ ను అందుకున్నాడు. ఇక ఈఏడాది మనమే అంటూ వచ్చేశాడు. ఎన్నో అంచనాల మధ్య ఈసినిమా జూన్ 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. లవ్ ఎమోషనల్ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈసినిమా అనుకున్నంత విజయాన్ని అందించలేకపోయింది. చాలా కాలం తరువాత శర్వా మళ్లీ ఎనర్జిటిక్ రోల్ తో వచ్చినా ఎందుకో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా ఈసినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన అమెజాన్ వారు ఎప్పుడో దక్కించుకున్న సంగతి తెలిసిందే కదా. అంతేకాదు ఈ నెలలోనే స్ట్రీమింగ్ కు కూడా వస్తుందని అన్నారు. కానీ కొన్ని కారణాల వల్ల ఈసినిమా ఓటీటీలోకి రాలేకపోయింది. అయితే ఇప్పుడు ఈసినిమా ఓటీటీ రిలీజ్ పై ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ఒకటి బయటకు వచ్చింది. ఈనెల చివరిలో ఈసినిమా స్ట్రీమింగ్ కు రానుందని అంటున్నారు. మరి థియేటర్లలో మిస్ అయిన వారు ఓటీటీ లో చూసి ఎంజాయ్ చేయొచ్చు.

కాగా ఆదిత్య శ్రీరామ్ దర్శకత్వంలో వచ్చిన ఈసినిమాలో కృతిశెట్టి హీరోయిన్ గా నటించగా.. విక్రమ్ ఆదిత్య, సీరత్ కపూర్, వెన్నెల కిషోర్, అయేషా ఖాన్, రాహుల్ రవీంద్రన్, రాహుల్ రామకృష్ణ, శివ కందుకూరి, సుదర్శన్ కీలక పాత్రల్లో నటించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై నిర్మించిన ఈసినిమాకు హేషమ్ అబ్దుల్ సంగీతం అందించాడు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.