టాలీవుడ్ మాస్ మహారాజ రవితేజ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మిస్టర్ బచ్చన్’. ట్యాలెంటెడ్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా హరీష్ శంకర్, రవితేజ కాంబోలో ఇది హ్యాట్రిక్ మూవీ కావడం విశేషం. ఇంతకుముందు వీరిద్దరూ కలిసి షాక్, మిరపకాయ్ చిత్రాలు చేయగా.. ఇందులో మిరపకాయ్ బ్లాక్ బాస్టర్ అనిపించుకుంది. ఈ నేపథ్యంలో తాజాగా వస్తోన్న మిస్టర్ బచ్చన్ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ సినిమా ప్రేక్షకులకు అల్టిమేట్ ఎంటర్‌టైన్‌మెంట్ అందించడానికి రెడీగా ఉంది. మిస్టర్ బచ్చన్ సినిమాలో రవితేజ సరసన భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్‍గా నటిస్తోంది. జగపతి బాబు, సచిన్ ఖేడేకర్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ సింగిల్ ‘సితార్’ పాట క్లాసికల్, లవ్లీ కంపోజిషన్, బ్యూటీఫుల్ లోకేషన్స్, రవితేజ, భాగ్యశ్రీ బోర్స్ మధ్య స్టీమీ రొమాన్స్ తో విశేషంగా అలరించి చార్ట్ బస్టర్ హిట్ అయ్యింది.
ఈ నేపథ్యంలో మిస్టర్ బచ్చన్ నుంచి సెకండ్ సింగిల్ అప్‌డేట్ వచ్చింది. ‘రెప్పల్ డప్పుల్’ అనే రెండో పాటను జూలై 25న విడుదల చేయనున్నారు. ఈ మేరకు మేకర్స్ తాజాగా సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఇక ఈ సందర్భంగా రిలీజ్ చేసిన రవితేజ కొత్త పోస్టర్ ఆకట్టుకుంటోంది. కాగా మిస్టర్ బచ్చన్ ఆగస్ట్ 15న ఇండిపెండెన్స్ డే రోజున ఈ చిత్రం థియేటర్లలో విడుదల కానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























