మంచు విష్ణు ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా కన్నప్ప. భారీ నిర్మాణంతో, భారీ బడ్జెట్ తో ఈసినిమా రాబోతుండటంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక రీసెంట్ గానే ఈసినిమా రిలీజ్ పై కూడా క్లారిటీ ఇచ్చారు. డేట్ అయితే ఫిక్స్ చేయలేదు కానీ డిసెంబర్ లో ఈసినిమా రిలీజ్ అవుతుందని చెప్పాడు. ప్రస్తుతం అయితే చిత్రయూనిట్ అయితే షూటింగ్ ను పూర్తి చేసే పనిలో ఉన్నారు. మరోవైపు చిన్నగా ప్రమోషన్స్ ను కూడా మొదలుపెట్టారు. ఇప్పటికే టీజర్ ను రిలీజ్ చేయగా టీజర్ కు మంచి రెస్పాన్స్ సైతం దక్కింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఈసినిమాలో నటిస్తున్న వారికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్లను వరుసగా రిలీజ్ చేసుకుంటూ వస్తున్నారు మేకర్స్. దీనిలో భాగంగానే ఇప్పుడు మరో స్టార్ హీరో పాత్రను పరిచయం చేశారు. ఈసినిమాలో శరత్ కుమార్ కూడా కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో ఇప్పుడు తాజాగా తన పాత్రను సంబంధించిన అప్ డేట్ ను ఇచ్చారు కన్నప్ప మేకర్స్. శరత్ కుమార్ పోస్టర్ ను రిలీజ్ చేస్తూ ఆయన పాత్రను రివీల్ చేశారు. ఈసినిమాలో నతనాదుడు అనే పాత్రలో నటిస్తున్నాడు శరత్ కుమార్. అంతేకాదు తను పాండవ భీమ సేన అలానే హిడింబిల వారసుడు అని, ఆ జాతికి నాయకుడని తెలియచేశారు. మరి శరత్ కుమార్ ఫస్ట్ లుక్ అయితే ఆకట్టుకుంటుంది.
కాగా కాగా ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో వస్తున్న ఈసినిమాలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పాటు కాజల్, మోహన్ లాల్, కన్నడ స్టార్ హీరో శివ రాజ్ కుమార్, ప్రీతి ముకుందన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈసినిమాను అవా ఎంటర్టైన్మెంట్ ఇంకా 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్స్ పై మంచు విష్ణు తండ్రి, సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు నిర్మిస్తున్నారు. మణిశర్మ, స్టీఫెన్ దేవాసి సంయుక్తంగా ఈసినిమాకు సంగీతం అందిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























