పవన్ అంటే ఇష్టం.. కానీ తారక్ తో చేస్తా- ధనుష్

i like to do a multistarrer with jr ntr says dhanush

టాలెంటెడ్ హీరో ధనుష్ ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే కదా. అందులో రాయన్ సినిమా కూడా ఒకటి. ధనుష్ హీరోగా నటిస్తున్న స్వీయ దర్శకత్వంలో ఈసినిమా వస్తుంది. ఈసినిమా జులై 26వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం అయితే ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. సన్ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈసినిమాలో ఎస్.జే.సూర్య, ప్రకాష్ రాజ్, సెల్వరాఘవన్‌, అపర్ణా బాలమురళి, ధుషార విజయన్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా ఈసినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే కదా. ఈకార్యక్రమానికి టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్స్ అయిన సురేష్ బాబు అలానే దిల్ రాజు ముఖ్య అతిథిలుగా హాజరయ్యారు. ఇక ఈ ఈవెంట్ లో పాల్గొన్న ధనుష్ సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు తేలియచేశారు. ఈసినిమా తమిళ్ ప్రేక్షకులకు మాత్రమే కాకుండా తెలుగు ప్రేక్షకులకు కూడా నచ్చుతుంది.. నాకు నటనతో పాటు డైరెక్షన్ అంటే కూడా ఎంతో ఇష్టం.. ఆ ఇష్టంతో వచ్చిన సినిమానే ఇది అని తెలిపారు. ఇంకా ఇదే వేదికపై యాంకర్ పలు ప్రశ్నలు అడిగారు అందులో టాలీవుడ్ లో మీకు బాగా నచ్చిన హీరో ఎవరు అని అడగగా దానికి ధనుష్ పవన్ కల్యాణ్ గారు అంటే ఇష్టం అని తెలిపారు. మరో ప్రశ్నగా మల్టీ స్టారర్ చేసే ఛాన్స్ ఉంటే ఎవరితో చేస్తారు? మహేశ్ బాబు- జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్ అని అడగ్గా.. తాను మల్టీ స్టారర్ చేస్తే తారక్ తో చేస్తాను అంటూ ధనుష్ స్పష్టం చేశారు. ఇక ధనుష్ సమాధానంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి తారక్- ధనుష్ మల్టీ స్టారర్ అంటే ఆ క్రేజ్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీరిద్దరి కాంబినేషన్ ఎప్పటికైనా సెట్ అవ్వాలని కోరుకుందా..

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.