పాన్ ఇండియా రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ ‘కల్కి 2898 AD’. టాలీవుడ్ విజనరీ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణే హీరోయిన్‌గా నటించగా.. ఇండియన్ లెజెండరీ యాక్టర్స్ అమితాబ్ బచ్చన్ మరియు కమల్ హాసన్ కీలక పాత్రల్లో కనిపించారు. అలాగే దిశాపటానీ, మాళవిక నాయర్, బెంగాలీ నటుడు స్వాస్థ్ ఛటర్జీ, రాజేంద్రప్రసాద్, పశుపతి తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై స్టార్ ప్రొడ్యూసర్ అశ్వనీదత్ భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రం జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజైన విషయం తెలిసిందే. ఫ్యూచరిస్టిక్ ఎపిక్ మైథలాజికల్ డ్రామాగా తెరకెక్కిన కల్కి భారీ అంచనాల నడుమ విడుదలై గ్లోబల్ వైడ్‌గా సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతూ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. ఇప్పటివరకూ మొత్తం రూ.1,000 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి రూ.1,100 కోట్లు దిశగా పరుగులు పెడుతోంది.
ఇక ఇదిలావుంటే, ఇప్పటికే మేకింగ్ పరంగా, టెక్నికల్ పరంగా, క్వాలిటీ పరంగా ఎన్నో ప్రశంసలు అందుకుంటున్న కల్కి సినిమా గురించి మరికొన్ని ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. తాజాగా ఈ సినిమాకు ప్రొడక్షన్ డిజైనర్‌గా పనిచేసిన నితిన్ జిహాని చౌదరి ముఖ్యమైన విషయాలను తెలియజేశారు. ఈ మేరకు ఆయన ఒక ఇంటర్వ్యూలో భాగంగా సెకండ్ పార్ట్ మరియు కమల్ హాసన్ పాత్రకు సంబంధించి కొన్ని కీలక విషయాలను పంచుకున్నారు.
ఈ సందర్భంగా ప్రొడక్షన్ డిజైనర్ నితిన్ జిహాని చౌదరి మాట్లాడుతూ.. “కల్కి చిత్రంలో మీరు చూసింది కేవలం ఒక్క కాంప్లెక్స్ మాత్రమే. అయితే ఇంకో 6 కాంప్లెక్స్‌లు ఉన్నాయి. నాగి రాసుకున్న కథ ప్రకారం, ఆఫ్రికాలో ఒకటి, అమెరికాలో ఒకటి, ఇలా మొత్తం 7 కాంప్లెక్స్‌లు ఉంటాయి. ఇవి ఒక్కొక్కటి ఒక్కో ప్రాంతంలో ఉంటాయి. వీటన్నింటికి సుప్రీం యాస్కిన్ ఒక కింగ్ (లీడర్)గా ఉంటాడు. ఇక యాస్కిన్ పురాణ పురుషుడు ‘కలి’ కింద పనిచేస్తుంటాడు. ఈ 6 కాంప్లెక్స్‌లు మరియు కలి పాత్ర కల్కి సెకండ్ పార్ట్‌లో కీలకంగా ఉంటాయి” అని ఆసక్తికరమైన విషయాలను వివరించారు.
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్‌ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























