ధనుష్ నటించిన లేటెస్ట్ సినిమా రాయన్. తన కెరీర్లో 50వ సినిమాగా వస్తున్న ఈసినిమాకు ధనుషే స్వయంగా దర్శకత్వం వహించడం విశేషం. ఈ సినిమాలో ధనుష్ ఒక మెకానిక్ గా నటిస్తున్నాడు. ఈసినిమా మరో నాలుగు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈసినిమా నుండి టీజర్, ట్రైలర్ తో పాటు పలు పాటలను కూడా రిలీజ్ చేశారు. అప్ డేట్లు అన్నీ సినిమాపై అంచనాలను పెంచేశాయి. ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా నిన్ననే ఘనంగా నిర్వహించారు. ఇక ఈవెంట్ కి ధనుష్ సహా చిత్ర యూనిట్ తో పాటు నిర్మాతలు సురేష్ బాబు, దిల్ రాజు వంటి నిర్మాతలు అతిథులుగా హాజరయ్యారు. ఇదిలా ఉండగా తాజాగా ఈసినిమా నుండి మరో అప్ డేట్ తో వచ్చారు మేకర్స్. ఈసినిమా బుకింగ్స్ ఓపెన్ అయినట్టు తెలిపారు చిత్రయూనిట్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా ఈసినిమాలో ఇంకా ఎస్.జే.సూర్య, ప్రకాష్ రాజ్, సెల్వరాఘవన్, అపర్ణా బాలమురళి, ధుషార విజయన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తమిళ్ టాప్ నిర్మాణ సంస్థ అయిన సన్ పిక్చర్స్ బ్యానర్ పై ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఓం ప్రకాశ్ డీవోపీగా అలానే యాక్షన్ కొరియోగ్రాఫర్‌గా పీటర్ హెయిన్ వ్యవహరిస్తున్నారు. ఏ ఆర్ రెహ్మాన్ సంగీతం అందిస్తున్న ఈసినిమాను తమిళ, తెలుగు, హిందీ భాషల్లో రిలీజ్ చేయనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























