శివం భజే ట్రైలర్ రిలీజ్ టైమ్ ఫిక్స్

Ashwin Babu Shivam Bhaje Movie Trailer Release Time Fixed,Telugu Filmnagar,Latest Telugu Movies News,Latest Tollywood Updates,Telugu Film News 2024,Tollywood Movie Updates,Shivam Bhaje Trailer,Shivam Bhaje Movie Trailer,Shivam Bhaje Telugu Movie Trailer,Shivam Bhaje Trailer Release Date,Shivam Bhaje Movie Trailer Release Date,Shivam Bhaje Trailer Release Date Update,Ashwin Babu Shivam Bhaje Movie,Shivam Bhaje Trailer Update,Shivam Bhaje,Shivam Bhaje Movie,Shivam Bhaje Telugu Movie,Ashwin Babu

అప్సర్ దర్శకత్వంలో అశ్విన్ బాబు హీరోగా వస్తున్న సినిమా శివం భజే. న్యూ ఏజ్ డివైన్ సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో వస్తున్న ఈసినిమా పై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక ఈసినిమా ఆగష్ట్ 1 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ కు మరికొద్దిరోజులు మాత్రమే ఉండటంతో చిత్రయూనిట్ ఇప్పటినుండే వరుసగా అప్ డేట్లు సినిమాపై మంచి బజ్ ను క్రియేట్ చేస్తున్నారు. ఇప్పటికే పలు పోస్టర్లు, గ్లింప్స్ రిలీజ్ చేయగా వాటికి మంచి రెస్పాన్సే వచ్చింది. అంతేకాదు ఫస్ట్ సింగిల్ రం రం ఈశ్వరం అనే పాటను రిలీజ్ చేయగా పవర్ ఫుల్ గా ఉన్ ఆ సాంగ్ కూడా ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు ట్రైలర్ ను రిలీజ్ చేయడానికి సిద్దమవుతున్నారు. ఈనేపథ్యంలోనే ట్రైలర్ రిలీజ్ టైమ్ ను ఫిక్స్ చేస్తూ అధికారికంగా ప్రకటించారు. ఈసినిమా ట్రైలర్ ను జులై 23వ తేదీన ఉదయం 12 గంటల 6 నిమిషాలకు రిలీజ్ చేయనున్నట్టు తెలిపారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఈసినిమాలో సూర్యవంశీ హీరోయిన్ గా నటిస్తుండగా.. ఇంకా అర్బాజ్ ఖాన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇంకా ఈసినిమాలో హైపర్ ఆది, మురళీ శర్మ, సాయి ధీన, బ్రహ్మాజీ, తులసీ, దేవి ప్రసాద్, అయ్యప్ప శర్మ, షకలక శంకర్, కాశీ విశ్వనాథ్, ఇనయ సుల్తానా తదితరులు నటిస్తున్నారు. గంగ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ప్రొడక్షన్ నంబర్ 1గా ఈసినిమా రాబోతుంది. వికాస్ బడిస సంగీతం.. సినిమాటోగ్రాఫర్ గా దాశరథి శివేంద్ర పనిచేయనున్నారు. మరి ఎప్పటినుండో మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న అశ్విన్ కు ఈసినిమాతో అయినా హిట్ దక్కుతుందో? లేదో? చూద్దాం.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.