పేక మేడలు ప్రమోషన్స్ కోసం ప్రభాస్, బన్నీని కలవబోతున్నాం-నిర్మాత రాకేష్ వర్రే

we are going to meet prabhas bunny for peka medalu movie promotions says producer rakesh varre

క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ సంస్థ నుంచి రాకేష్ వర్రే నిర్మాతగా వినోద్ కిషన్ హీరో గా అనూష కృష్ణ హీరోయిన్ గా నీలగిరి మామిళ్ల దర్శకత్వంలో వచ్చిన సినిమా పేక మేడలు. ఉమెన్ ఎంపవర్మెంట్ ని బేస్ చేసుకున్న సినిమా ఇది. చూసిన ప్రతి ఒక్కరు సినిమా చాలా బాగుందని ప్రశంసిస్తున్నారు. ఈ సినిమాని తెలుగులో నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ ధీరజ్ మొగిలినేని గారు రిలీజ్ చేశారు. అయితే ఈ సినిమా సక్సెస్ అయిన సందర్భంగా గ్రాండ్ సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ సందర్భంగా దర్శకుడు నీలగిరి మామిళ్ల గారు మాట్లాడుతూ : స్టార్టింగ్ నుంచి మీడియా ఇస్తున్న సపోర్ట్ కి ప్రత్యేక కృతజ్ఞతలు. సినిమా రిలీజ్ అయిన దగ్గరనుంచి 50 కాల్స్ పైన వచ్చాయి. చూసిన ప్రతి ఒక్కరు చాలా బాగుంది మంచి ఎమోషనల్ సినిమా తీశారు అని ప్రశంసిస్తున్నారు. ముఖ్యంగా ఆడవాళ్ళ నుంచి చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది. సినిమా మొదలుపెట్టినప్పటి నుంచి ఎంతో సపోర్ట్ చేసిన మా నిర్మాత రాకేష్ గారికి మా టీం కి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. సినిమాని ఇంత సక్సెస్ చేసిన ప్రేక్షకులకు పాదాభివందనాలు అన్నారు.

నిర్మాత రాకేష్ వర్రే గారు మాట్లాడుతూ : దాదాపు రెండేళ్లు ఈ సినిమా పైన కష్టపడ్డాం. ఈరోజు ఈ సక్సెస్ చూస్తుంటే ఎమోషనల్ గా ఉంది. ఈ సినిమా సక్సెస్ తో నాలో కాన్ఫిడెన్స్ పెరిగింది ఇంకా ఇలాంటి మంచి సినిమాలు తీయొచ్చు అనిపించింది. చిన్న సినిమాలకు జనాలు రారు అనేది తప్పు. మంచి సినిమా కంటెంట్ ఉన్న సినిమా తీస్తే కచ్చితంగా ప్రజలు థియేటర్కు వస్తారు. అదేవిధంగా నా ఈ ప్రయాణంలో నాకు ఎంతో సపోర్టుగా నిలిచిన అనూష, కేతన్ అదేవిధంగా మార్కెటింగ్ టీం అందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు. తెలుగు ప్రేక్షకులు మంచి సినిమా వస్తే మరోసారి నిరూపించారు. ఇలాంటి సక్సెస్ ఇచ్చిన ప్రేక్షకులకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అన్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.