రివ్యూ : డార్లింగ్

Darling Review in Telugu,Telugu Filmnagar,Latest Telugu Movies News,Latest Tollywood Updates,Telugu Film News 2024,Tollywood Movie Updates,Darling Review,Darling Movie Review,Darling Telugu Movie Review,Darling Telugu Movie Review 2024,Darling First Review,Darling Movie First Review,Darling Review And Rating,Darling Movie Review And Rating,Darling Review And Response,Darling Movie Review And Response,Priyadarshi Darling Movie,Priyadarshi Darling Movie Review,Darling Telugu Movie 2024,Darling,Darling Movie,Darling Telugu Movie,Priyadarshi,Priyadarshi Movies,Nabha Natesh,Priyadarshi Pulikonda

నటీనటులు : ప్రియదర్శి, నభా నటేష్,అనన్య నాగళ్ల
ఎడిటింగ్ : ప్రదీప్ ఇ.రాఘవ్  
సినిమాటోగ్రఫీ : నరేష్ రామదురై 
సంగీతం : వివేక్ సాగర్ 
దర్శకత్వం : అశ్విన్ రామ్ 
నిర్మాతలు : చైతన్య రెడ్డి, నిరంజన్ రెడ్డి

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కమెడియన్ నుండి సోలో హీరో గా ఫుల్ బిజీ అయిపోయాడు ప్రియదర్శి.గత ఏడాది ఆయన హీరోగా వచ్చిన బలగం బ్లాక్ బాస్టర్ కావడంతో వరస ఆఫర్లు అందుకుంటున్నాడు.ఇక హీరోగా ప్రియదర్శి నటించిన లేటెస్ట్ మూవీ డార్లింగ్.రిలీజ్ కు ముందు ప్రమోషన్స్ తో హడావిడి చేసింది.ట్రైలర్ కూడా పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకుంది.దీనికి తోడు హనుమాన్ నిర్మాతలను వస్తున్న సినిమాకావడంతో డార్లింగ్ పై అంచనాలు ఏర్పడ్డాయి.మరి ఈరోజే థియేటర్లలోకి  వచ్చిన ఈసినిమా ఎలా వుంది? ప్రియదర్శి కి మరో హిట్ ఇస్తుందో లేదో తెలుసుకుందాం. 

కథ : 

ఓ ట్రావెల్ ఏజెన్సీలో ఏజెంట్ అయిన రాఘవ (ప్రియదర్శి) పెళ్లి చేసుకొని హనీమూన్ కు న్యూయార్క్ వెళ్లాలని ఆశయంగా పెట్టుకుంటాడు.ఈక్రమంలో నందిని (అనన్య నాగళ్ల) తో పెళ్లి ఫిక్స్ అవుతుంది అయితే సైకాలజిస్ట్ అయినా నందిని రాఘవకు హ్యాండ్ ఇచ్చి తను ప్రేమించిన వాడితో వెళ్ళిపోతుంది.ఇది తట్టుకోలేని రాఘవ ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటాడు అయితే అప్పుడే ఆనంది (నభా)తన లైఫ్ లోకి ఎంట్రీ ఇస్తుంది.తనను పెళ్లి కూడా చేసుకుంటాడు.ఇక అక్కడి నుండి రాఘవ లైఫ్ టర్న్ అవుతుంది.ఆనందికి స్ప్లిట్ పర్సనాలిటీ ఉంటుంది.దాంతో రాఘవ ఎలాంటి కష్టాలు పడ్డాడు.ఇంతకీ తను న్యూయార్క్ పోవాలనుకున్న లక్ష్యం నెరవేరిందా? ఆనందికి వున్న సమస్య ను పోగట్ట గలిగాడా  అనేది మిగితా కథ. 

విశ్లేషణ : 

స్ప్లిట్ పర్సనాలిటీ అనే కాన్సెప్ట్ తో ఇంతకుముందు కూడా సినిమాలు వచ్చాయి అయితే  ఈ ఐడియాను డార్లింగ్ తో కామెడీ గా చెప్పాలనుకున్నాడు డైరెక్టర్ అశ్విన్ రామ్.అందులో చాలా వరకు సక్సెస్ అయ్యాడు.సినిమా టేక్ ఆఫ్ అవ్వడమే ఆసక్తిగా ఉంటుంది.పెళ్లి విషయంలో రాఘవ చిన్నప్పటి నుండి కన్న కలలు ఆ తరువాత తన ఆశయాన్ని నెరేవేర్చుకోవడానికి చేసే ప్రయత్నాలు ఈ  నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు ఇవన్నీ టైం పాస్ చేయిస్తాయి.

ముఖ్యంగా పెళ్ళిపీటలపై పెళ్లి ఆగిపోవడం ఆతరువాత వచ్చే సన్నివేశాలు చాలా ఎంటర్టైన్ చేస్తాయి.ఇక రాఘవ లైఫ్ లోకి ఆనంది వచ్చాక మరింత హిలేరియస్ అనిపిస్తుంది.అసలు కథ కూడా అప్పుడే స్టార్ట్ అవుతుంది.ఇంటర్వల్ సీక్వెన్స్ సెకండ్ హాఫ్ పై అంచనాలు పెంచేస్తాయి.ఇక సెకండ్ హాఫ్ కూడా ఎంటర్టైన్ చేస్తుంది అయితే ఎమోషనల్ సన్నివేశాలను ఇంకొంచెం బాగా రాసుకోవాల్సింది.ఓవరాల్ గా డార్లింగ్ అయితే ఎంటర్టైన్ చేయడంలో నిరాశపరచదు. 

నటీనటుల విషయానికి వస్తే ప్రియదర్శి సినిమాకు చాలా ప్లస్ అయ్యాడు.రాఘవ పాత్రను చాలా స్టేబుల్ గా చేసుకుంటూ తనదైన కామెడీ టైమింగ్ తో నవ్వించాడు.ఇక ఆనంది పాత్రలో నభా కూడా  పోటీ పడి నటించింది.తనకు నటించడానికి చాలా స్కోప్ వున్న పాత్ర దొరికింది.వేరియషన్స్ కూడా చాలా బాగా చూపించింది.మిగిలిన పాత్రల విషయానికి వస్తే రఘుబాబు,మురళీధర్ గౌడ్ తమకు అలవాటైన పాత్రల్లో కనిపించారు.బ్రహ్మానందం,సుహాస్ ,నిహారిక కొణిదెల అతిథి పాత్రల్లో మెరిశారు.

టెక్నికల్ గా కూడా సినిమా ఓకే అనిపిస్తుంది.వివేక్ సాగర్ అందించిన సంగీతం డీసెంట్ గా వుంది.బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పర్వాలేదనిపిస్తుంది.సినిమాటోగ్రఫీ బాగుంది. విజువల్స్ చాలా క్వాలిటీ గా వున్నాయి.ఎడిటింగ్ విషయానికి వస్తే సినిమాను ఇంకొంచెం ట్రిమ్ చేస్తే బాగుండేది.నిర్మాతలు సినిమాకు బాగానే ఖర్చు చేశారు.ఆ ఖర్చు తెర మీద  కనిపిస్తుంది.


ఓవరాల్ గా హిలేరియస్ ఎంటర్టైనర్ అనే ట్యాగ్ లైన్ తో వచ్చిన డార్లింగ్ టైం పాస్ చేయిస్తుంది.కథ ,ప్రియదర్శి,నభా నటేష్ నటన, ఫస్ట్ హాఫ్ సినిమాలో హైలైట్ అయ్యాయి.సింపుల్ ఎంటర్టైనర్ లను ఇష్టపడే వారికి ఈసినిమా నచ్చుతుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.