రీ-రిలీజ్‌కి సిద్దమైన విక్రమార్కుడు

Mass Maharaja Ravi Tejas Vikramarkudu Ready For Re-release

టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ కెరీర్‌లో గుర్తుండిపోయే చిత్రాలలో ‘విక్రమార్కుడు’ ఒకటి. దర్శకధీరుడు ఎస్ఎస్. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ అయింది. ఈ చిత్రంలో రవితేజ డ్యూయల్ రోల్స్ పోషించగా.. ఆయన సరసన స్టార్ హీరోయిన్ అనుష్క ఫిమేల్ లీడ్ రోల్‌లో నటించారు. ఆస్కార్ అవార్డ్ విన్నింగ్ కంపోజర్ ఎం.ఎం. కీరవాణి సంగీతం అందించిన ఈ సినిమాలోని పాటలన్నీ చార్ట్ బస్టర్‌గా నిలిచాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

విక్రమ్ సింగ్ రాథోడ్ మరియు అత్తిలి సత్తిబాబుగా రవితేజ ద్విపాత్రాభినయంతో ప్రేక్షకులను అలరించారు. ఇక హిందీ నటుడు వినీత్ కుమార్, అజయ్ ప్రతినాయకులుగా నటించగా.. బేబి హర్షి, ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, అలీ, రాజీవ్ కనకాల, రఘుబాబు తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు. శ్రీ కీర్తి క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రొడ్యూసర్ ఎం.ఎల్. కుమార్ చౌదరి నిర్మించిన విక్రమార్కుడు 2006, జూన్ 23న విడుదలైంది.

ఈ బ్లాక్ బస్టర్ మూవీ మళ్లీ విడుదలకు సిద్ధమైంది. తెలుగునాట టాప్ లీడింగ్ డిజిటల్ మీడియా అయిన ‘మ్యాంగో మాస్ మీడియా’ ఈ సూపర్ హిట్ చిత్రాన్ని జూలై 27న ప్రేక్షకులముందుకు తీసుకొస్తోంది. ఈ క్రమంలో శనివారం 4కే లో రీ-రిలీజ్ ట్రైలర్ విడుదల చేయబోతోంది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అందులో.. “విక్రమ్ సింగ్ రాథోడ్ IPS మరియు అత్తిలి సత్తి తిరిగి వస్తున్నారు. విక్రమార్కుడు అధికారిక 4K రీ-రిలీజ్ ట్రైలర్ రేపు ఉదయం 10 గంటలకు రిలీజ్ అవుతోంది” అని తెలిపారు.

ఇక ఇదిలావుండగా, రవితేజ ఇతర సినిమాల విషయానికొస్తే.. ఆయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘మిస్టర్ బచ్చన్‌’. ‘నామ్ తో సునా హోగా’ అనే ట్యాగ్‌లైన్‌తో వస్తోన్న ఈ మూవీకి క్రేజీ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తుండగా.. సీనియర్ నటుడు జగపతి బాబు కీలక పాత్ర పోషిస్తున్నారు. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకురానుంది.

దీనితోపాటు మరోవైపు రవితేజ మైల్ స్టోన్ మూవీ #RT75 నిర్మాణ దశలో ఉంది. యువ రచయిత భాను బోగవరపు ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.