రాబిన్‌హుడ్ నుండి రాజేంద్ర ప్రసాద్ ఫస్ట్ లుక్ రివీల్

Rajendra Prasad First Look Revealed From Robinhood on His Birthday

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్‌ కథానాయకుడిగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘రాబిన్‌హుడ్’. సక్సెస్‌ఫుల్ డైరెక్టర్‌ వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది. ఇంతకుముందు వీరిద్దరి కాంబోలో ‘భీష్మ’ అనే సినిమా వచ్చిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఇందులో నితిన్‌ సరసన లేటెస్ట్ సెన్సేషన్ శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలావుంటే, ప్రస్తుతం నిర్మాణదశలో ఉన్న ఈ సినిమా నుంచి రిలీజైన టైటిల్ గ్లింప్స్ సహా అన్ని ప్రచార చిత్రాలకి మూవీ లవర్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా చిత్ర బృందం ఒక ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ అందించింది. టాలీవుడ్ సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్‌ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసింది. ఈ పోస్టర్ గమనిస్తే, ఆయన ఇందులో ఓ కీలక పాత్ర పోషిస్తున్నట్టు అర్ధమవుతోంది.

శుక్రవారం రాజేంద్ర ప్రసాద్ జన్మదినం సందర్భంగా ఆయన పాత్రను పరిచయం చేసింది. ఈ మేరకు చిత్ర యూనిట్ సోషల్ మీడియాలో..” ‘నట కిరీటి’ రాజేంద్ర ప్రసాద్‌ గారికి టీమ్ రాబిన్‌హుడ్ నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు. అందరి అభిమాన నటుడైన రాజేంద్ర ప్రసాద్ గారు ఏజెంట్ జాన్ స్నో అకా జనార్ధన్ సున్నిపెంటగా బిగ్ స్క్రీన్‌లపై నవ్వులు పూయిస్తారు” అని పేర్కొంది.

మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్‌లు నిర్మిస్తున్న ఈ చిత్రానికి కోలీవుడ్ స్టార్ మ్యూజిక్ కంపోజర్ జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. ప్రవీణ్ పూడి ఎడిటర్‌గా, రామ్ కుమార్ ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. కాగా డిసెంబర్ 20న రాబిన్‌హుడ్ సినిమా థియేటర్లలోకి రానుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.