సరిపోదా శనివారం-టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్

nani saripodhaa sanivaaram movie teaser release date

వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నాని హీరోగా రాబోతున్న సినిమా సరిపోదా శనివారం ఒకటి. వీరిద్దరి కాంబినేషన్ లో రాబోతున్న రెండో సినిమా ఇది. ఈసినిమాలో నాని కంప్లీట్ యాక్షన్-ప్యాక్డ్ అవతార్‌లో అలరించనున్నాడు. ఇప్పటికే ఈసినిమా టైటిల్ తో పాటు గ్లింప్స్ ను కూడా రిలీజ్ చేయగా వాటికి మంచి రెస్పాన్సే వచ్చింది. ప్రస్తుం అయితే ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈసినిమా నుండి వరుసగా పాటలను రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఫస్ట్ సింగిల్ గరం గరం అంటూ వచ్చే పాటను, అలానే ఉల్లాసం అంటూ వచ్చే మరో పాటను రిలీజ్ చేశారు. మాసీ సాంగ్ అయిన గరం గరం పాటను, మెలోడీయస్ గా నాని- ప్రియాంక మోహన్ మధ్య వచ్చిన ఉల్లాసం సాంగ్ రెండూ ఆకట్టుకున్నాయి. ఇప్పుడు ఈసినిమాకు సంబంధించి మరో సర్ ప్రైజింగ్ అప్ డేట్ ను ఇచ్చారు. ఈసినిమా టీజర్ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేస్తూ ప్రకటించారు. జులై 20వ తేదీన టీజర్ ను రిలీజ్ చేయనున్నారు.

కాగా ఈసినిమాలో తమిళ్ టాలెంటెడ్ నటుడు ఎస్ జే సూర్య కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈసినిమాను డీవీవీ ఎంటర్ టైన్ మెంట్స్ పై  నిర్మిస్తున్నారు. సెన్సేషనల్ కంపోజర్ జేక్స్ బిజోయ్ సంగీతం అందించగా, మురళి జి సినిమాటోగ్రాఫర్, కార్తీక శ్రీనివాస్ ఎడిటర్. ఈ పాన్ ఇండియా చిత్రం ఆగస్టు 29, 2024న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.