35 మూవీ- నివేదా స్పెషల్ గ్లింప్స్ రిలీజ్

nivetha thomas special glimpse out from 35 movie

ముందు నుండీ పాత్ర ప్రధానమైన సినిమాలు చేయడంలో ఎప్పుడూ ముందుంటుంది టాలెంటెట్ యాక్ట్రస్ నివేద థామస్. అందుకే తన నుండి సినిమా వస్తుందంటే అందరూ చూడటానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. అయితే నివేదా నుండి సినిమా వచ్చి చాలా రోజులైపోయింది. ఇప్పుడు గ్యాప్ తరువాత తన నుండి వస్తున్న సినిమా 35. చిన్న కథ కాదు అనేది ఈసినిమా క్యాప్షన్. ఇందులో నివేదా థామ‌స్ ఓ మ‌ధ్య త‌ర‌గతి గృహిణి పాత్ర‌లో క‌నిపిస్తోంది. తిరుపతి బ్యాక్ డ్రాప్ లో ఈసినిమా తెరకెక్కుతున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటూ రిలీజ్ కు సిద్దమవుతుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మరోవైపు ఈసినిమా ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టారు. ఇప్పటికే ఈసినిమా నుండి టీజర్ ను కూడా రిలీజ్ చేశారు. టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. చదువులో వెనుకపడిన కొడుకును పాస్ చేయించడానికి ఆ త‌ల్లి ఏం చేసింద‌నే క‌థాంశంతో ఈ మూవీ తెర‌కెక్కిన‌ట్లుగా టీజర్‌ను బ‌ట్టి అర్థ‌మ‌యింది. ఇప్పుడు మరో అప్ డేట్ తో వచ్చారు. నివేదా పాత్రకు సంబంధించిన చిన్న గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. గ్లింప్స్ అయితే ఆకట్టుకుంటుంది.

కాగా ఈసినిమాలో ఇంకా ప్రియ దర్శని, విశ్వ‌దేవ్ లు కీలకపాత్రల్లో నటిస్తున్నారు. టాలెంటెడ్ హీరో రానా దగ్గబాటి ఈసినిమాకు నిర్మాతగా వ్యవహరించనున్నారు. వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నాడు. ఆగష్ట్ 15వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.