ఓంకార్ తమ్ముడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు అశ్విన్ బాబు. తన కెరీర్ లో రాజు గారి గది లాంటి రేంజ్ లో మరొక హిట్ దక్కలేదని చెప్పొచ్చు. అయినా కూడా మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఇప్పుడు మరో ప్రయోగాత్మకమైన సినిమాతో వస్తున్నాడు. అప్సర్ దర్శకత్వంలో అశ్విన్ బాబు హీరోగా రాబోతున్న సినిమా శివం భజే. శివుని నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలే నెలకొన్నాయి. ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటూ రిలీజ్ కు సిద్దమవుతుంది. ఈసినిమా రిలీజ్ డేట్ ను రీసెంట్ గానే ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. ఆగష్ట్ 1వ తేదీన ఈసినిమాను రిలీజ్ చేయనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
మరోవైపు ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టారు. ఇప్పటికే ఈసినిమా నుండి వచ్చిన అప్ డేట్లు అన్నీ సినిమాపై అంచనాలను పెంచేశాయి. మూవీ పోస్టర్స్, అశ్విన్ ఫస్ట్‌లుక్‌తో మూవీపై హైప్ క్రియేట్ అయ్యింది. ఇప్పుడు ఈసినిమా ఫస్ట్ సింగిల్ కు సంబంధించిన అప్ డేట్ తో వచ్చారు. రంరం ఈశ్వరం అంటూ వచ్చే ఈపాటను రేపు జులై 18వ తేదీన ఉదయం 11 గంటల 36 నిమిషాలకు రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు.
కాగా ఈసినిమాలో అశ్విన్ బాబు సరసన దిగంగనా సూర్యవంశీ హీరోయిన్ గా నటిస్తుండగా.. ఇంకా అర్బాజ్ ఖాన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇంకా ఈసినిమాలో హైపర్ ఆది, మురళీ శర్మ, సాయి ధీన, బ్రహ్మాజీ, తులసీ, దేవి ప్రసాద్, అయ్యప్ప శర్మ, షకలక శంకర్, కాశీ విశ్వనాథ్, ఇనయ సుల్తానా తదితరులు నటిస్తున్నారు. గంగ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ప్రొడక్షన్ నంబర్ 1గా ఈసినిమా రాబోతుంది. వికాస్ బడిస సంగీతం.. సినిమాటోగ్రాఫర్ గా దాశరథి శివేంద్ర పనిచేయనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:
































