తమిళ్ టాలెంటెడ్ నటుడు కార్తీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన సినిమాలతో తమిళ్ తో పాటు తెలుగులో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్నాడు. ఖైదీ, సర్దార్, పొన్నియన్ సెల్వం ఇలా వరుసగా హిట్లను అందుకున్నాడు. అయితే ఈమద్య వచ్చిన జపాన్ సినిమా కాస్త నిరాశను మిగిల్చింది. ఇక ఈసినిమాను ఎప్పుడో అధికారింకగా ప్రకటించినా సెట్స్ పైకి మాత్రం ఇంతవరకూ తీసుకెళ్లలేదు. అయితే రీసెంట్ గానే ఈసినిమా రెగ్యులర్ షూటింగ్ ను మొదలుపెట్టారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఇప్పుడు ఈసినిమా నుండి మరో అప్ డేట్ ను ఇచ్చాను చిత్రబృందం. ఈసినిమాలో డైరెక్టర్ కమ్ టాలెంటెడ్ నటుడు అయిన ఎస్ జే సూర్య నటిస్తున్నట్టు చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించారు. ఎస్ జే సూర్య పుట్టినరోజు సందర్భంగా ఈ అప్ డేట్ ను ఇచ్చారు. మరి ఈ సాలిడ్ సీక్వెల్ లో ఎస్ జే సూర్య ఎలాంటి రోల్ లో కనిపిస్తాడో చూడాలి.
కాగా పిఎస్ మిత్రన్ దర్శకత్వంలో వస్తున్న ఈసినిమాను ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్ పై లక్ష్మణ్ కుమార్ నిర్మిస్తున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తుండగా.. జార్జి సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో తెలియచేయనున్నారు.
మరి సర్దార్2 సినిమా సర్దార్ కు సీక్వెల్ గా వస్తున్న సంగతి తెలిసిందే. వాటర్ మాఫియా, ప్లాస్టిక్ బాటిల్స్ లో నీరు త్రాగడం వల్ల ప్రజలకు ఎదురవుతున్న సమస్యలు, తాగు నీటి విలువ గురించి ఈసినిమాలో చూపించగా.. ఈసినిమా సూపర్ హిట్ అయింది. మరి ఈసీక్వెల్ ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























