తెలుసు కదా రెగ్యులర్ షూటింగ్ అప్పటినుండే

siddhu jonnalagadda telusu kada movie regular shooting update

ప్రస్తుతం సిద్దూ జొన్నలగడ్డ ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. సిద్దూ సినీ కెరీర్ ను ప్రారంభించి ఎన్నో ఏళ్లు అవుతున్నా డీజే టిల్లు సినిమాతో మాత్రం ఒక్కసారిగా సూపర్ అప్పటివరకూ లేని క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు. ఇక ఈఏడాది డీజే టిల్లు సీక్వెల్ టిల్లు స్క్వేర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు. ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు సిద్దూ. అందులో నీరజ కోన దర్శకత్వంలో వస్తున్న ఒక సినిమా కూడా ఉంది. ఇప్పటివరకూ స్టైలిష్ గా పనిచేసిన నీరజ ఈసినిమాతో దర్శకురాలిగా పరిచయం అవుతుంది. తెలుసు కదా అనే టైటిల్ తో ఈసినిమా రాబోతుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈసినిమాను ఎప్పుడో ప్రకటించారు. అంతేకాదు ఇప్పటికే సిద్దూ లుక్ ను, మోషన్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. ఇదిలా ఉండగా ఈసినిమా షూటింగ్ గురించి ఇప్పుడు ఒక ఆసక్తికర అప్ డేట్ బయటకువచ్చింది. ఈసినిమా రెగ్యులర్ షూటింగ్ ను ఆగష్ట్ 5 వ తేదీ నుండి హైద్రాబాద్ లో ప్రారంభించనున్నట్టు తెలుస్తుంది. ఈ షెడ్యూల్ కు సంబంధించిన అప్ డేట్ ను త్వరలో ఇవ్వనున్నట్టు సమాచారం.

కాగా ఈసినిమాలో రాశీ ఖన్నా, నిధి శెట్టి హీరోయిన్లుగా నటిస్తుండగా.. ఈసినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తుండగా.. యువరాజ్ సినిమాటోగ్రాఫర్ గా శ్రీకర ప్రసాద్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.