మాస్ మహారాజా రవితేజ మాత్రం జయాపజయాలతో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. గత ఏడాది ఇప్పటికే పలు సినిమాలు రిలీజ్ చేయగా ఈ ఏడాది అప్పుడే ఈగల్ అంటూ వచ్చేశాడు. ఈసినిమా డీసెంట్ హిట్ ను అందుకుంది. ఇక ఇప్పుడు ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వంలో మిస్టర్ బచ్చన్ అనే సినిమాను చేస్తున్నాడు. ఈసినిమా ఎప్పటినుండో షూటింగ్ ను జరుపుకుంటుండగా చిత్రీకరణ దాదాపు చివరి దశకు వచ్చింది. అయితే రిలీజ్ డేట్ మాత్రం ఇంతవరకూ ప్రకటించలేదు. త్వరలోనే రిలీజ్ డేట్ అప్ డేట్ ఇవ్వనున్నట్టు తెలుస్తుంది. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా మొదలుపెట్టారు. ఈనేపథ్యంలోనే ఈసినిమా డబ్బింగ్ కు సంబంధించిన అప్ డేట్ తో వచ్చారు మేకర్స్. తాజాగా హరీష్ శంకర్ తన ట్విట్టర్ ద్వారా జగ్గూభాయ్ తో డబ్బింగ్ ను మొదలుపెట్టినట్టు తెలిపాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా నుండి ఫస్ట్ రీల్ అంటూ రిలీజ్ చేసి గ్లింప్స్ ఆకట్టుకుంది. మరోవైపు ఈసినిమా మ్యూజికల్ ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టారు. ఇటీవలే ఈ మూవీ నుంచి విడుదల చేసిన సితార్ సాంగ్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. బ్యూటీఫుల్ లిరిక్స్‌తో మ్యూజిక్ లవర్స్ మనసు దోచేస్తుంది.
ఈసినిమాలో రవితేజ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తుండగా, అయనంక బోస్ సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. ఈ చిత్రానికి అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్ కాగా, ఎడిటింగ్ ఉజ్వల్ కులకర్ణి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























