మచ్ అవైటెడ్ కంగువ నుండి ఫస్ట్ సాంగ్ రానుంది.ఈ సాంగ్ హీరో సూర్య బర్త్ డే సందర్భంగా ఈనెల 23న రిలీజ్ కానుందట.ఈవిషయాన్ని ఈసినిమా మ్యూజిక్ డైరెక్టర్ రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ రీసెంట్ గా ఓ ఈవెంట్ లో తెలియజేశాడు.త్వరలోనే ఈ సాంగ్ రిలీజ్ డేట్ ను అఫీషియల్ గా అనౌన్స్ చేయనున్నారు.ఇక షూటింగ్ పూర్తి చేసుకున్న ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ లో వుంది.రీసెంట్ గా ఈసినిమా నుండి వచ్చిన టీజర్ అంచనాలను భారీగా పెంచేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
శివ ఈసినిమాను డైరెక్ట్ చేస్తుండగా దిశా పటాని ,బాబీ డియోల్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.సూర్య కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది ఈసినిమా. స్టూడియో గ్రీన్ తో కలిసి యూవీ క్రియేషన్స్ నిర్మిస్తుంది.అక్టోబర్ 10న కంగువా థియేటర్లలోకి రానుంది.
ఇక సూర్య ప్రస్తుతం తన 44 వ సినిమాలో నటిస్తున్నాడు.పేట ఫేమ్ కార్తీక్ సుబ్బరాజ్ ఈసినిమాను డైరెక్ట్ చేస్తుండగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది.సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నాడు.ఇటీవలే ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయ్యింది.సూర్య సొంత బ్యానర్ 2డి ఎంటర్టైన్మెంట్ ఈసినిమాను నిర్మిస్తుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























