ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ రేంజ్ లో పేరు సొంతం చేసుకున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఇక ఇప్పుడు తన నుండి రాబోతున్న మోస్ట్ అవైటెడ్ సినిమా గేమ్ ఛేంజర్. లెజెండరీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో ఈసినిమా వస్తుంది. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను పూర్తి చేసుకునే పనిలో ఉంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు ఈసినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న ఈసినిమాను తమిళ్, తెలుగు, హిందీలో చిత్రీకరిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఈసినిమా తరువాత రామ్ చరణ్ బుచ్చిబాబు తో సినిమా చేయనున్న సంగతి తెలిసిందే కదా. ఇప్పుడు ఈసినిమా గురించి ఓ సూపర్ అప్ డేట్ ఇచ్చాడు డైరెక్టర్ బుచ్చిబాబు. ఈసినిమాకు సంగీతం అందిస్తున్న ఏఆర్ రెహ్మాన్, ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రత్నవేలు సినిమాటోగ్రఫి అందిస్తున్న నేపథ్యంలో.. వీరిద్దరితో బుచ్చిబాబు దుబాయ్ లోని బెస్ట్ ఇన్ క్లాస్ ఫిర్దౌస్ స్టూడియో లో వర్క్ చేస్తున్నారు. అందుకు సంబంధించిన ఒక ఫోటోను బుచ్చిబాబు తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ఇద్దరూ తన ఫేవరెట్ అంటూ చెప్పుకొచ్చారు.
కాగా ఈసినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఏ.ఆర్ రెహమాన్ మ్యూజిక్ డైరెక్టర్ గా.. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రత్నవేలు సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు. ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ని మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్ సమర్పణలో వ్రిద్ధి సినిమాస్ బ్యానర్ పై వెంకట సతీష్ కీలారు నిర్మించనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:


































