ఇస్మార్ట్ శంకర్ బ్లాక్ బాస్టర్ అవ్వడంలో సాంగ్స్ కూడా కీ రోల్ ప్లే చేశాయి.మణిశర్మ ట్యూన్స్ కు రామ్ వేసిన స్టెప్పులు యూత్ ను ఫిదా చేశాయి.ఇక ఇప్పుడు ఈసినిమాకు సీక్వెల్ గా డబుల్ ఇస్మార్ట్ వస్తున్న విషయం తెలిసిందే.షూటింగ్ కూడా అయిపోయింది. ప్రమోషన్స్ లో భాగంగా ప్రస్తుతం సాంగ్స్ ను రిలీజ్ చేస్తున్నారు.అందులో భాగంగా రీసెంట్ గా ఫస్ట్ సాంగ్ స్టెప్పా మార్ రిలీజ్ చేయగా సూపర్ రెస్పాన్స్ వచ్చింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పుడు సెకండ్ సాంగ్ మార్ ముంతా చోడ్ చింతా పాట విడుదలవుతుంది.రేపు సాయంత్రం 4గంటలకు ఫుల్ సాంగ్ రిలీజ్ కానుండగా ఈరోజు ప్రోమో ను రిలీజ్ చేశారు.ఈ మాస్ సాంగ్ కూడా అదరగొట్టేలా వుంది.ఎనర్జిటిక్ సాంగ్ లో రామ్ డాన్స్ హైలైట్ అవ్వనుంది.కాసర్ల శ్యామ్ ఈ సాంగ్ ను రచించాడు.
ఇక ఈ సీక్వెల్ పై భారీ అంచనాలు వున్నాయి.పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తుండగా కావ్య థాపర్ హీరోయిన్ గా నటించింది.సంజయ్ దత్ విలన్ రోల్ లో కనిపించనున్నాడు.పూరితో కలిసి ఛార్మి నిర్మిస్తుంది.ఈసినిమా విజయం పూరికి అలాగే రామ్ కు తప్పనిసరి కానుంది.ఆగస్టు 15న డబుల్ ఇస్మార్ట్ థియేటర్లలోకి రానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























