గత కొద్దిరోజులుగా దేశవ్యాప్తంగా వినిపిస్తున్న పేరు కల్కి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ మైథాలజీ నేపథ్యంలో వచ్చిన సినిమా ఇది. ఈసినిమాపై మొదటినుండీ భారీ అంచనాలే ఉన్నాయి. ఇక ఆ అంచనాలను నిజం చేస్తూ రిలీజ్ అయిన ఫస్ట్ షో నుండే బ్లాక్ బస్టర్ టాక్ ను సొంతం చేసుకుంటూ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. సినిమాను చూసిన ప్రతి ఒక్కరూ సినిమాపై ప్రశంసలు కురిపించారు. నాగ్ అశ్విన్ ఐడియాను.. దానిని తెరపై చూపించిన విధానానికి ఫిదా అయ్యారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఈసినిమా కలెక్షన్స్ పరంగా సాలిడ్ కలెక్షన్స్ ను రాబట్టుకుంటున్న సంగతి తెలిసిందే కదా. ఈనేపథ్యంలోనే తాజాగా ఈసినిమా మరో రికార్డ్ ను సొంతం చేసుకుంది. ఈసినిమా తాజాగా 1000 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది. ఈ విషయాన్ని చిత్రయూనిట్ ప్రకటించింది. ఈ సందర్భంగా మూవీ నుంచి ఒక స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. కర్ణుడి గెటప్‌లో ఉన్న ప్రభాస్ స్పెషల్ పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేయగా అది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరోవైపు తెలుగు ఇండస్ట్రీలో రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన చిత్రాలలో కల్కి మూడవ స్థానాన్ని దక్కించుకుంది. బాహుబలి 2, ఆర్ఆర్ఆర్ ముందు రెండు స్థానాలను దక్కించుకున్నాయి.
కాగా ఈసినిమాలో దీపికా పదుకొనె, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటానీ, సస్వతా ఛటర్జీ, శోభన, అన్నా బెన్, విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్, దుల్కర్ సల్మాన్, రాజేంద్ర ప్రసాద్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈసినిమాకు సంతోష్ నారాయణన్ సంగీతం అందించగా.. జోర్డ్జే స్టోజిల్జ్కోవిచ్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేశారు. ఈసినిమాను తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం, ఇంగ్లీష్ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేశారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























