దళపతి విజయ్ వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఇక విజయ్ కు తమిళ్ లో ఎంత క్రేజ్ ఉందో తెలుగులో కూడా అదే రేంజ్ లో క్రేజ్ ఉందన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే తన సినిమాలను తెలుగులో కూడా రిలీజ్ చేస్తుంటారు. ప్రస్తుతం తన నుండి వస్తున్న సినిమా ది గోట్. వెంకట్ ప్రభు దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈసినిమా వస్తుంది. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది. ఇక ఈసినిమా సెప్టెంబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఈసినిమా నుండి పాటలను వరుసగా రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే విజిల్ పొడు, చిన్న చిన్న కంగల్ ఆనే పాటలను రిలీజ్ చేశారు. ఇప్పుడు తెలుగు వెర్షన్ పాటలను కూజా రిలీజ్ చేస్తున్నారు. ఈనేపథ్యంలోనే తమిళ్ లో మంచి రెస్పాన్స్ తెచ్చుకున్న విజిల్ పొడు సాంగ్ తెలుగు వెర్షన్ ను రిలీజ్ చేశారు. నిన్న ఈపాట ప్రోమోను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే కదా. ఇప్పుడు ఫుల్ సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్. తెలుగు వెర్షన్ సాంగ్ కూడా ఆకట్టుకుంటుంది.
కాగా ఈసినిమాలో విజయ్ కు జోడీగా మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తుండగా స్నేహ, ప్రశాంత్, ప్రభుదేవా, జైరాం, లైలా, కమెడియన్, అజ్మల్, యోగిబాబు, వైభవ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈసినిమాను ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై అర్చన కల్పతి నిర్మిస్తున్నారు. యువన్‌శంకర్ రాజా సంగీతం అందిస్తున్నాడు. తమిళంతో పాటు తెలుగు, హిందీ భాషల్లో సెప్టెంబర్ 5వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























