G2 గురించి త్వరలో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌ – అడివి శేష్

Adivi Sesh Announces Will Give Interesting Update About G2 on August 3rd

టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో అడివి శేష్ ప్రధానపాత్రలో నటిస్తోన్న తాజా చిత్రం ‘G2’. వినయ్ కుమార్ సిరిగినీడి దర్శకత్వం వహిస్తున్నారు. అద్భుతమైన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాలో బనితా సంధు హీరోయిన్‌గా నటిస్తోంది. కాగా ఇది బనితాకు మొదటి పాన్ ఇండియా చిత్రం కానుంది. ఇంతకుముందు ఆమె అక్టోబర్, సర్దార్ ఉదం, తమిళ చిత్రం ఆదిత్య వర్మ వంటి చిత్రాలలో నటించింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

గత కొన్నిరోజులక్రితం గుజరాత్‌లోని భుజ్‌లో ఓ భారీ షెడ్యూల్‌ జరిగింది. దీనిలో భాగంగా అడివి శేష్, బనితపై కీలకమైన సన్నివేశాలు చిత్రీకరించారు. ఆ తర్వాత ఈ చిత్రం గురించి ఎలాంటి అప్‌డేట్స్ లేవు. ఈ నేపథ్యంలో హీరో అడివి శేష్ G2 గురించి త్వరలో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ రానున్నట్టు తెలిపారు. సోషల్ మీడియా వేదికగా తాజాగా ఒక అభిమాని ఆయనను G2 గురించి పలు ప్రశ్నలు సంధించాడు. అడివి శేష్ అన్నా.. G2 నుంచి ఏధైనా అప్‌డేట్ ఇవ్వన్నా అని కోరారు.

అంతేకాకుండా అసలు సినిమా ఎంతవరకు వచ్చింది? ఎలా ఉంటుందని మేము భావించొచ్చు? ఈ సినిమాకు సంబంధించి ఏదయినా అనౌన్స్‌మెంట్ త్వరలో ఇస్తారా? అని ఆ అభిమాని హీరోను అడిగారు. దీనిపై స్పందించిన అడివి శేష్.. ఆగస్టు 3న G2 నుంచి అప్‌డేట్ ఇస్తానని తెలిపారు. ఈ సందర్భంగా ‘దూకుడు’ సినిమాలోని ఓ కీలక సన్నివేశాన్ని జోడించడం విశేషం. కాగా ‘గూఢచారి’ సినిమా 2018లో ఆగస్టు 3న విడుదలయింది. అదేరోజున G2 అప్‌డేట్ రానుండటం గమనార్హం.

కాగా జి2లో బాలీవుడ్ స్టార్ యాక్టర్ ఇమ్రాన్ హష్మీ కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. స్టైలిష్ విలన్‌గా ఆయన కనిపించనున్నారు. 2018లో వచ్చిన గూఢచారి చిత్రానికి హై-ఆక్టేన్ యాక్షన్ సీక్వెల్‌గా ఆరేళ్ల తర్వాత మళ్లీ సెల్యులాయిడ్‌లోకి వస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై టిజి విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ కలిసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.