అఫీషియల్.. RC16లో శివన్న

RC 16 Team Welcomes Kannada Star Shiva Rajkumar on His Birthday

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఇప్పటికే కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ‘గేమ్ ఛేంజర్’లో నటిస్తున్న ఆయన, దీని తరువాత ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సానాతో కలిసి ఒక క్రేజీ ప్రాజెక్ట్ చేయనున్న విషయం తెలిసిందే. కాగా ప్రస్తుతం దీనిని #RC16 అనే వర్కింగ్ టైటిల్‌తో వ్యవహరిస్తున్నారు. క్రీడా కథాంశం నేపథ్యంలో రూపొందనున్న ఈ మూవీపై అభిమానుల్లో భారీగానే అంచనాలున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈ చిత్రంలో స్టార్ కాస్టింగ్ భాగం కానుంది. అలనాటి అందాల తార శ్రీదేవి కుమార్తె.. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్‌ #RC16లో కథానాయికగా నటిస్తోంది. తాజాగా మరో అఫీషియల్ న్యూస్ వచ్చింది. ఈ చిత్రంలో కన్నడ స్టార్ హీరో శివ రాజ్‌కుమార్ (శివన్న) భాగమయ్యారు. ఈ సినిమాలో ఆయన ఓ కీలక రోల్ పోషించనున్నారు. ఈ మేరకు తాజాగా చిత్ర నిర్మాణ సంస్థ సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించింది. శుక్రవారం శివన్న జన్మదినం సందర్భంగా ఆయనకు స్వాగతం పలుకుతూ ట్వీట్ చేసింది.

ఇక #RC16 సినిమాకు ఆస్కార్ అవార్డ్ విన్నింగ్ కంపోజర్ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తుండగా.. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రత్నవేలు కెమెరామెన్‌గా పనిచేయనున్నారు. కాగా రామ్ చరణ్ చేస్తున్న గేమ్ ఛేంజర్ మరియు #RC16 చిత్రాలు రెండూ భారీ ప్రాజెక్టులు కావడం, అందునా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుండటంతో మెగా అభిమానులు వీటికోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గేమ్ ఛేంజర్ ఈ ఏడాది విడుదలకు సిద్ధమవుతుండగా.. #RC16 మూవీ త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.