లెజండరీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో విలక్షణ నటుడు కమల్ హాసన్ హీరోగా వస్తున్న సినిమా ఇండియన్ 2. 1996 లో కమల్ హాసన్ హీరోగా నటించి సంచలనం సృష్టించిన భారతీయుడు సినిమాకు సీక్వెల్ గా ఇండియన్ 2 సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈసినిమా మరికొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఇండియన్ 3 సినిమా కూడా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ప్రమోషన్ లో భాగంగా జరిగిన మీడియా సమావేశంలోనే శంకర్ ఇండియన్3 సినిమాపై క్లారిటీ ఇచ్చారు. ఇక ఇప్పుడు ఈసినిమా గురించి ఒక ఇంట్రెస్టింగ్ అప్ డేట్ కూడా ఇచ్చారు. ఇండియన్ 3 ప్రమోషన్స్ లో భాగంగా చిత్రబృందం పలు ప్రాంతాలు తిరుగుతున్నారు. ఈనేపథ్యంలో తాజాగా కేరళ లోని కొచ్చి వెళ్లారు. ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ.. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈసినిమాను ఆరు నెలల్లో రిలీజ్ చేస్తామని తెలిపారు. అంతేకాదు.. ఇండియన్ 2 ఎండింగ్లో ఇండియన్ 3 ట్రైలర్ను చూపించబోతున్నట్టు చెప్పాడు. దీంతో శంకర్ ఇచ్చిన అప్ డేట్ తో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు.
ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియ భవాని శంకర్ ఫీమేల్ లీడ్ లో నటిస్తుండగా.. సిద్ధార్ధ్, సముద్రఖని ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్, రెడ్ జియాంట్ మూవీస్ పై ఉదయనిధి స్టాలిన్, సుభాస్కరన్ ఈసినిమాను తెరకెక్కిస్తున్నారు. తెలుగు థియేట్రికల్ హక్కులను ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్స్, సీడెడ్ హక్కులను శ్రీలక్ష్మి మూవీస్ సంస్థలు దక్కించుకున్నాయి. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. మరి ఈ సీక్వెల్ ఎలాంటి సంచనాలు క్రియేట్ చేస్తుందో చూడాలి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























