‘ఆర్ఆర్ఆర్’ చిత్రంతో గ్లోబల్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తోన్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ ‘గేమ్ ఛేంజర్’. పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోన్న ఈ మూవీకి కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. చరణ్ 15వ చిత్రంగా రూపొందుతోన్న ఈ సినిమాలో ఆయన సరసన కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలాఉంటే.. ఈ మూవీ అప్డేట్స్ కోసం మెగా ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఇటీవలే చిత్ర యూనిట్ గేమ్ ఛేంజర్‌లో తన పాత్రకు సంబంధించి చరణ్ షూటింగ్ కంప్లీట్ చేశారని తెలిపింది. ఈ నేపథ్యంలో దర్శకుడు శంకర్ అభిమానులకు అదిరిపోయే అప్డేట్ అందించారు. గేమ్ ఛేంజర్ మూవీ ఎలా ఉండనుందో చూచాయగా వెల్లడించారు.
గేమ్ ఛేంజర్ నా స్టైల్లో ఉండే మాస్ ఫిల్మ్ అని పేర్కొన్నారు డైరెక్టర్ శంకర్. ఈ మేరకు ఆయన తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ సినిమాకు సంబంధించిన ప్రశ్నలకు బదులిచ్చారు. గేమ్ ఛేంజర్ ఎలా ఉంటుంది? అన్న యాంకర్ ప్రశ్నకు శంకర్ సమాధానమిస్తూ.. ‘తొలినుంచీ నేను తమిళంలో తీసిన చిత్రాలు అన్నీ తెలుగులో ఘనవిజయం సాధించాయి. దీంతో నాకు తెలుగులో నేరుగా ఓ సినిమా చేయాలని ఉండేది. గేమ్ ఛేంజర్ తో అది నెరవేరుతోంది” అని తెలిపారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ.. “ఇక నాకు మాస్ సినిమాలంటే బాగా ఇష్టం. వాస్తవానికి ఇది కార్తీక్ సుబ్బరాజ్ రాసుకున్న కథ. అయితే నాకు విపరీతంగా నచ్చడంతో నా స్టైల్‌కి అనుగుణంగా కొన్ని మార్పుచేర్పులు జరిగాయి. తెలుగులో ఇలాంటి ఫుల్ మాస్ ఫిల్మ్ వచ్చి చాలా కాలమైంది. ఇది తప్పకుండా ప్రేక్షకులను అలరిస్తుంది” అని పేర్కొన్నారు దర్శకుడు శంకర్. కాగా శంకర్ వ్యాఖ్యలపై మెగా ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. గేమ్ ఛేంజర్ బ్లాక్ బస్టర్ అవడం పక్కా అని నెట్టింట హోరెత్తిస్తున్నారు.
కాగా గేమ్ ఛేంజర్ సినిమాలో శ్రీకాంత్, ఎస్జే సూర్య, జయరామ్, సునీల్, అంజలి, నవీన్ చంద్ర తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. సోషల్ మెసేజ్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. పాన్ ఇండియా సినిమాగా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై టాలీవుడ్ అగ్ర నిర్మాతలు దిల్ రాజు, శిరీష్‌లు అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:


































