న్యాచురల్ స్టార్ నాని నుండి వస్తున్న మోస్ట్ అవైటెడ్ సినిమా సరిపోదా శనివారం. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈసినిమా రాబోతుంది. ప్రస్తుతం చిత్రయూనిట్ షూటింగ్ ను పూర్తి చేసుకుంటూనే మరోపక్క ప్రమోషన్ కార్యక్రమాలపై దృష్టి పెట్టారు. దీనిలో భాగంగానే వరుసగా అప్ డేట్లు ఇస్తూ వస్తున్నారు. రీసెంట్ గానే నాని సెకండ్ లుక్ అలానే ప్రియాంక మోహన్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు నిన్న ఈసినిమా నుండి స్పెషల్ మేకింగ్ షాట్స్ వీడియోను రిలీజ్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా నుండి గరం గరం అంటూ వచ్చే ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే కదా. మాస్ బీట్ తో వచ్చిన ఈ సాంగ్ మంచి రెస్పాన్సే సొంతం చేసుకుంది. ఈ పాట ఇప్పుడు తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా రిలీజ్ చేశారు. ఇప్పుడు సెకండ్ సాంగ్ ను రిలీజ్ చేయడానికి సిద్దమయ్యారు. ఈనేపథ్యంలోనే తాజాగా ఈసినిమా సెకండ్ సాంగ్ కు సంబంధించిన అప్ డేట్ ను ఇచ్చారు. ఉల్లాసం అంటూ వచ్చే ఈ పాటను జులై 13వ తేదీన రిలీజ్ చేయనున్నట్టు తెలిపారు.
కాగా ఈసినిమాలో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది. గ్యాంగ్ లీడర్ తరువాత మరోసారి నానికి జోడీగా నటిస్తుంది. ఇంకా ఈసినిమాలో తమిళ్ టాలెంటెడ్ నటుడు ఎస్ జే సూర్య కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈసినిమాను డీవీవీ ఎంటర్ టైన్ మెంట్స్ పై నిర్మిస్తున్నారు. సెన్సేషనల్ కంపోజర్ జేక్స్ బిజోయ్ సంగీతం అందించగా, మురళి జి సినిమాటోగ్రాఫర్, కార్తీక శ్రీనివాస్ ఎడిటర్. ఈ పాన్ ఇండియా చిత్రం ఆగస్టు 29, 2024న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:































