వెంకీ, అనిల్ రావిపూడి హ్యాట్రిక్ మూవీ షూట్ ప్రారంభం

Venkatesh and Anil Ravipudi's SVC58 Project Shoot Begins

టాలీవుడ్‌ స్టార్ హీరో విక్టరీ వెంక‌టేష్, సక్సెస్‍ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కలయికలో కొత్త చిత్రం తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై స్టార్ ప్రొడ్యూసర్ దిల్‌ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో వెంకటేష్ సరసన ఐశ్వర్య రాజేష్ ఫీ మేల్‌ లీడ్ రోల్‌లో నటిస్తుండగా.. మరో కథానాయికగా ‘గుంటూరు కారం’ ఫేమ్ మీనాక్షి చౌదరి కనిపించనుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇటీవలే ఈ క్రేజీ ప్రాజెక్టు లాంఛనంగా ప్రారంభమవగా.. తాజాగా షూటింగ్ గ్రాండ్‌గా మొదలైంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాణ సంస్థ వెంకటేశ్వర క్రియేషన్స్ సోషల్ మీడియా వేదికగా తెలిపింది. “వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబోలో, SVC58గా వస్తోన్న మూడో చిత్రం షూట్ ప్రారంభమయింది. ఈ షెడ్యూల్‌లో ప్రధాన తారాగణంలోని కొందరు నటీనటులపై కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నాం. ఇది ప్రేక్షకులకు ట్రిపుల్ ఎక్స్ థ్రిల్లింగ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఫీస్ట్ అవుతుంది. మరిన్ని అప్‌డేట్‌ల కోసం చూస్తూనే ఉండండి” అని అందులో పేర్కొంది.

మూవీ షూటింగ్ ప్రారంభం సందర్భంగా మేకర్స్ ఒక స్పెషల్ వీడియోను రిలీజ్ చేశారు. ఈ వీడియోలో దర్శకుడు అనిల్ రావిపూడి కొందరు నటీనటులకు సీన్స్ వివరిస్తూ కనిపించగా.. అలాగే నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ సెట్స్‌లో సందడి చేశారు. ఇక హీరోయిన్ మీనాక్షి చౌదరి, సీనియర్ నటుడు నరేష్, ‘యానిమల్’ ఫేమ్ ఉపేంద్ర లిమాయే, ‘బీస్ట్’ ఫేమ్ గణేష్ జనార్దనన్‌ తదితరులు షూటింగ్‌లో పాల్గొన్నారు.

ఎక్సలెంట్ వైఫ్, ఎక్స్ కాప్, ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ మధ్య జరిగే కథతో ట్రయాంగిల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందనున్న ఈ చిత్రంలో వెంకటేష్ మాజీ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనుండగా.. ఆయన భార్యగా ఐశ్వర్య రాజేష్, ఎక్స్ గర్ల్ ఫ్రెండ్‌గా మీనాక్షి చౌదరి నటిస్తున్నారు. కాగా వెంకటేష్, అనిల్ రావిపూడి కలయికలో ఇంతకుముందు వచ్చిన ‘ఎఫ్‌ 2’, ‘ఎఫ్ 3’ చిత్రాలు ఎంత పెద్ద హిట్ అయ్యాయో అందరికీ తెలిసిన విషయమే. అనిల్ రావిపూడి, వెంకటేష్ కాంబోలో వస్తోన్న హ్యాట్రిక్ చిత్రం కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. కాగా ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.