ఓటీటీ లోకి వచ్చేసిన ‘ధూమం’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Fahadh Faasil's Dhoomam Now Streaming on OTT

తెలుగులో మంచి గుర్తింపు దక్కించుకున్న ప్రముఖ మలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ఒకటి తాజాగా తెలుగు ఓటీటీలోకి వచ్చేసింది. గతేడాది జూన్‍లో థియేటర్లలో విడుదలైన ఆ చిత్రం పేరు ‘ధూమం’. సస్పెన్స్ థ్రిల్లర్ జానర్‌లో తెరకెక్కిన ఈ సినిమాకు పవన్‌ కుమార్‌ దర్శకత్వం వహించాడు. అపర్ణ బాలమురళి హీరోయిన్‍గా నటించగా.. వినీత్, అను మోహన్, అచ్యుత్ కుమార్, వినయ్ మీనన్, జోయ్ మాథ్యూ, నందు, భానుమతి తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కేజీఎఫ్, సలార్ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలను నిర్మించిన హొంబాలే ఫిల్మ్స్ సంస్థ ఈ సినిమాను రూపొందించింది. అయితే పూర్ణచంద్ర తేజస్వి సంగీతం అందించిన ధూమం మూవీ థియేటర్లలో యావరేజ్‌గా నిలిచింది.ఈ నేపథ్యంలో తాజాగా ధూమం సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఆహాలో ధూమం తెలుగు డబ్బింగ్‍తో నేటినుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మేరకు ఆహా సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించింది.

‘ధూమం’ కథ ఏంటంటే..?

కథానాయుకుడైన అవినాష్‌ (ఫాహద్‌ ఫాజిల్‌) ఓ సిగరెట్‌ కంపెనీలో సేల్స్‌మెన్‌గా పని చేస్తుంటాడు. అయితే ఓ అపరిచితుడి కారణంగా అతను అనుకోని ఇబ్బందుల్లో పడతాడు. తప్పనిసరి పరిస్థితుల్లో ఆ అపరిచితుడు చెప్పినట్టు చేయాల్సి వస్తుంది. ఒకవేళ అందుకు నిరాకరిస్తే అవినాష్‌ భార్య దియా (అపర్ణ బాలమురళి)ను చంపేస్తానని బ్లాక్ మెయిల్ చేస్తాడు. ఈ క్రమంలో అవినాష్‌ ఎలాంటి పనులు చేశాడు? అసలు ఆ అపరిచితుడు ఎవరు? అనేది తెలియాలంటే ధూమం సినిమా చూడాల్సిందే.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.