ఇండియన్ 2 సెన్సార్ పూర్తి

kamal haasan indian 2 movie completes censor formalities

లోకనాయకుడు కమల్ హాసన్ ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. విక్రమ్ తో మంచి కమ్ బ్యాక్ ఇచ్చిన కమల్ ఆ జోష్ తోనే కమల్ సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఇప్పటికే కమల్ కూడా ఒక కీలక పాత్రలో నటించిన కల్కి సినిమా రిలీజ్ అయింది. ఈసినిమాలో కూడా కమల్ తన కొత్త మేకోవర్ తో అలరించాడు. ఇక ఈసినిమా బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ లో దూసుకుపోతుంది. పార్ట్ 2 లో కమల్ పాత్ర ఎక్కవ ఉండబోతుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా కమల్ నుండి రాబోతున్న మోస్ట్ అవైటెడ్ సినిమా ఇండియన్ 2. ఈసినిమా ప్రస్తుతం రిలీజ్ కు సిద్దమవుతుంది. దీనిలో భాగంగానే ఇప్పటికే పలు పాటలను రిలీజ్ చేశారు. ట్రైలర్ ను కూడా రిలీజ్ చేసేశారు. ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. రీసెంట్ గానే ఈసినిమా రన్ టైమ్ కు సంబంధించిన అప్ డేట్ వచ్చిన సంగతి తెలిసిందే కదా. ఈసినిమాకు 3 గంటల రన్ టైమ్ ను ఫిక్స్ చేశారు మేకర్స్. ఇప్పుడు సెన్సార్ కు సంబంధించిన అప్ డేట్ వచ్చింది. తాజాగా ఈసినిమా సెన్సార్ ను పూర్తి చేసుకున్నట్టు తెలుస్తుంది. సెన్సార్ బృందం ఈసినిమాకు యూఏ సర్టిఫికెట్ అందించినట్టు తెలుస్తుంది.

కాగా శంకర్ దర్శకత్వంలో ఈసినిమా వస్తుంది. ఈసినిమా భారతీయుడు సినిమాకు సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియ భవాని శంకర్ ఫీమేల్ లీడ్ లో నటిస్తుండగా.. సిద్ధార్ధ్, సముద్రఖని ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్, రెడ్ జియాంట్ మూవీస్ పై ఉద‌య‌నిధి స్టాలిన్‌, సుభాస్కరన్‌ ఈసినిమాను తెరకెక్కిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. జులై12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.