ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో విష్ణు మంచు ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా కన్నప్ప. చాలా గ్యాప్ తరువాత మంచు విష్ణు నుండి వస్తున్న సినిమా ఇది. మహాశివుడి పరమ భక్తుడు భక్తు కన్నప్ప జీవిత నేపథ్యంలో ఈసినిమాను రూపొందిస్తున్నారు. భారీ బడ్జెట్ తో ఈసినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈసినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేయగా టీజర్ మంచి రెస్పాన్స్ నే సొంతం చేసుకుంది. ప్రస్తుతం అయితే చిత్రయూనిట్ షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా తాజాగా ఈసినిమాలో తాను వాడిన విల్లు గురించి పలు ఆసక్తికర విషయాలు తెలియచేశాడు మంచు విష్ణు. కన్నప్ప వాడిన విల్లుకు కూడా ఒక ప్రత్యేకత ఉందని.. చిన్న వయసు నుండే కన్నప్ప అడవిలో క్రూర మృగాలను ఎదుర్కొనే అలవాటు ఉండేది.. ఈనేపథ్యంలో తన కుమారుడి ధైర్యసాహసాలు చూసిన తండ్రి నాథనాథుడు ఎంతగానో సంతోషపడతాడు. అంతేకాదు కన్నప్ప కన్నప్ప కోసం పులి ఎముకలు, దంతాలతో విల్లును తయారుచేసి ఇస్తాడు. ఇక ఈ కథ గురించి న్యూజిలాండ్‌లోని ఆర్ట్ డైరెక్టర్ క్రిస్‌కు వివరించగా ఆయన ప్రత్యేకంగా ఈ విల్లును తయారుచేసి ఇచ్చారు అని మంచు విష్ణు తెలిపారు.
కాగా ఈసినిమాలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పాటు కాజల్, మోహన్ లాల్, కన్నడ స్టార్ హీరో శివ రాజ్ కుమార్, ప్రీతి ముకుందన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈసినిమాను అవా ఎంటర్టైన్మెంట్ ఇంకా 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్స్ పై మంచు విష్ణు తండ్రి, సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు నిర్మిస్తున్నారు. మణిశర్మ, స్టీఫెన్ దేవాసి సంయుక్తంగా ఈసినిమాకు సంగీతం అందిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























