శంకర్ -కమల్ హాసన్ కాంబోలో వస్తున్న మచ్ అవైటెడ్ మూవీ భారతీయుడు 2 కి నైజాంలో టికెట్ హైక్ తోపాటు అదనపు షో వేసుకోవడానికి పర్మిషన్ వచ్చింది. ఈసినిమా మరో రెండు రోజుల్లో థియేటర్లలోకి రానుంది.సురేష్ ప్రొడక్షన్స్ తెలుగులో విడుదలచేస్తుంది. దాంతో టికెట్ హైక్ తో పాటు స్పెషల్ షో కి అప్లై చేయగా తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.వారం రోజులకు గాను 5షో లతోపాటు సింగిల్ స్క్రీన్ లో టికెట్ పై 50,మల్టీ ఫ్లెక్స్ లో 75 రూపాయలు పెంచుకోవడానికి పర్మిషన్ ఇచ్చింది.ఆంధ్రప్రదేశ్ లో పర్మిషన్ రావాల్సివుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమాకు బాక్సాఫీస్ వద్ద పోటీ ఎదురుకానుంది.ప్రస్తతం ప్రభాస్ కల్కి 2898 ఏ డి హవా కొనసాగుతుండడం తో భారతీయుడు 2కి పోటీ తప్పేలా లేదు.బ్లాక్ బాస్టర్ భారతీయుడు సినిమాకు సీక్వెల్ గా వస్తున్న ఈసినిమాలో సిద్దార్థ్ ,రకుల్ ప్రీత్ సింగ్, బాబీ సింహ,సముద్రఖని కీలక పాత్రల్లో నటించగా అనిరుధ్ సంగీతం అందించాడు.లైకా ప్రొడక్షన్ ఈసినిమాను నిర్మించింది.మరి కల్కి తరువాత పెద్ద సినిమా గా వస్తున్న భారతీయుడు 2 ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























