టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ నటుడు ప్రియదర్శి క్యామియో రోల్స్‌తో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి అనంతరం హీరో స్థాయికి అడిగాడు. ప్రముఖ తెలంగాణ చేనేత కళాకారుడు చింతకింది మల్లేశం జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ‘మల్లేశం’ సినిమాతో ప్రేక్షకులతోపాటు విమర్శకుల ప్రశంసలూ అందుకున్నాడు. ఈ క్రమంలో ప్రియదర్శి ప్రధానపాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ‘డార్లింగ్’. ‘వై దిస్ కొలవరి?’ అనేది టాగ్ లైన్‌గా ఉంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
రొమాంటిక్ ఎంటర్ టైనర్‌గా రూపొందిన ఈ సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తయింది. జూలై 19వ తేదీన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో మేకర్స్ మూవీ ప్రమోషన్స్‌ని మొదలుపెట్టారు. ఇప్పటికే సినిమా నుంచి రిలీజ్ చేసిన ‘ఖలసే’, ‘రాహీ రే’ పాటలు సంగీత ప్రియులను అలరించగా.. తాజాగా విడుదల చేసిన మూవీ ట్రైలర్ సినీ ప్రియులను ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలో డార్లింగ్ నుంచి మరో కీలక అప్‌డేట్ వచ్చింది.
రీసెంట్‌గా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికేట్ అందించింది. ఈ మేరకు చిత్ర బృందం సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించింది. ఈ సందర్భంగా ఎక్స్‌లో.. ‘జూలై 19న ఈ మ్యాడ్‌మాక్స్ మ్యారేజ్ ఎంటర్‌టైనర్ థియేటర్లలోకి రానుంది. మీరు మరచిపోలేని ఉల్లాసమైన సాహసం కోసం సిద్ధంగా ఉండండి’ అని అందులో పేర్కొంది.
కాగా అశ్విన్ రామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఇస్మార్ట్ భామ నభా నటేష్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. బ్రహ్మనందం, అనన్య నాగళ్ల, మురళీధర్ గౌడ్, విష్ణు, కృష్ణతేజ, శివారెడ్డి తదితరులు ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ‘హనుమాన్’ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న నిర్మాత నిరంజన్ రెడ్డి ప్రైమ్ షో ఎంటర్ టైనమెంట్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మించగా చైతన్య రెడ్డి సమర్పిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























