బ్లాక్ మ్యాజిక్ కాన్సెప్ట్ తో వచ్చిన ఇంట్రెస్టింగ్ హార్రర్ సినిమా మా ఊరి పొలిమేర. ఈసినిమా డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ అయింది. అయితే ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈసినిమా సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. దాంతో మేకర్స్ పొలిమేర2 ను తీశారు. సెకండ్ పార్ట్ కూడా ఓటీటీ రిలీజ్ అయి మంచి హిట్ ను దక్కించుకుంది. అంతేకాదు ఈసినిమా దాదా సాహెబ్ పాల్కే అవార్డ్ సైతం దక్కించుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పుడు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తుంది పొలిమేర 3 కోసం. ఈనేపథ్యంలో ఎప్పటినుండో వెయిట్ చేస్తున్న అప్ డేట్ అయితే వచ్చేసింది. తాజాగా ఈసినిమా నుండి అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. పొలిమేర ఫ్రాంచైజ్ పొలిమేర3 తో మరో లెవల్ కు వెళ్లింది.. ఈసినిమా స్క్రిప్ట్ కంప్లీట్ అయింది.. ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలయ్యాయి అంటూ అధికారికంగా ప్రకటించారు.
కాగా ఈసినిమాకు కూడా అనిల్ విశ్వనాథ్ దర్శకత్వంలో వహిస్తున్నాడు. సత్యం రాజేష్ తో పాటు పొలిమేర1, పొలిమేర2 లో భాగమైన కామాక్షి భాస్కర్ల, గెటప్ శ్రీను, రాకెండ్ మౌళి, బాలాదిత్య కూడా ఈ సినిమాలో ఉండబోతున్నారు. వంశీ నడిపాటి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై వంశీ నడిపాటి ఈసినిమాను నిర్మిస్తుండగా.. బోగేంద్ర గుప్తా కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























