కంగువ పార్ట్ 2 పై ఇంట్రెస్టింగ్ అప్ డేట్

k e gnanavel raja interesting comments on kanguva part 2

సూర్య నుండి రాబోతున్న మోస్ట్ అవైటెడ్ సినిమా కంగువ. హిస్టారికల్ వార్ బ్యాక్‌డ్రాప్‌‌లో.. ఈ సినిమా 1000 సంవత్సరాల క్రితం జరిగిన కథ ఆధారంగా తెరకెక్కుతున్నట్టు తెలుస్తుంది. ఎంతో కాలంగా ఈసినిమా రిలీజ్ డేట్ పై కన్ఫ్యూజన్ నెలకొన్న సంగతి తెలిసిందే కదా. ఫైనల్లీ రీసెంట్ గానే ఈసినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేస్తూ ప్రకటించారు మేకర్స్. అక్టోబర్ 10వ తేదీన ఈసినిమాను రిలీజ్ చేయనున్నారు. ప్రస్తుతం అయితో పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది చిత్రయూనిట్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా ఈసినిమా పార్ట్ 2 పై నిర్మాత జ్ఞానవేల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ కామెంట్స్ చేశారు. మేము ముందుగానే పార్టు 1, పార్టు 2 కోసం కథ రాసుకున్నాం. ఆదిశగానే షూటింగ్ ను పూర్తి చేశారు.. పార్ట్1 ముగింపు, అందులోని కొన్ని ఎలిమెంట్స్ పార్ట్ 2 పై ఇంట్రెస్ట్ ను కలుగచేస్తాయి. పార్టు 1 కోసం 185 రోజులు షూట్ చేశాం. 2025 చివరలో కానీ 2026 మొదట్లో కానీ పార్టు 2 సెట్స్‌పైకి తీసుకెళతాం..2027 సమ్మర్ లో ఈసినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి . ప్రయత్నిస్తాం అని తెలిపారు.

కాగా ఈసినిమాలో సూర్య సరసన దిశా పటాని హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాని స్టూడియో గ్రీన్ తో పాటు టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ సంస్థ యు.వీ క్రియేషన్స్ కూడా కలిసి నిర్మిస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. మొత్తం 3డీ వర్షెన్‌లో పలు భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. మరి డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తున్న ఈసినిమా ఎన్ని సంచలనాలు క్రియేట్ చేస్తుందో చూడాలి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.